BJP: చెరువులో దూకి బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య.. కారణం ఏంటంటే?
- చెరువులో దూకి బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య
- కారణం అతను తన తల్లిని కొట్టడమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి జిల్లాలో ఓ బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఉప్పల్ కు చెందిన బీజేపీ కార్యకర్త రెవల్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణం అతను తన తల్లిని కొట్టడమే. కుటుంబంలో తలెత్తిన వివాదం కారణంగా రాజు తల్లిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. తన తల్లి కొట్టొద్దని వేడుకున్నా సరే విచక్షణ కోల్పోయి తల్లిని చెంప మీద కొట్టాడు. కాలితో తన్నాడు. అయితే ఈ సమయంలో అక్కడున్న వారు వారిస్తున్నా రాజు మాత్రం పట్టించుకోలేదు.
Also Read:Ranbir Kapoor: నెపొటిజం అంటారు కానీ.. ఇంటి పేరు నిలబెట్టడం అంత ఈజీ కాదు
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ఈ తతాంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియో వైరల్ కావడంతో తన పరువు పోయిందని.. నేను నలుగురిలో తల ఎత్తుకుని తిరగలేనంటూ మనోవేధనకు గురయ్యాడు. సెల్పీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు బీజేపీ కార్యకర్త రాజు. ఆయన మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని భువనగిరి ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మృతుడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?