MP Sanjay Singh: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్‌సింగ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర ఉవ్వెత్తున ఎగసిపడుతుంటే.. మోడీ జీ20 వేడుకలు జరుపుకున్నారని మండిపడ్డారు. సైన్యానికి సంతాపం తెలుపుతూ ట్వీట్ చేయడానికి ప్రధానికి 2 నిమిషాల సమయం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని చెప్పుకుంటున్నారని.. అయినప్పటికీ కొన్నిసార్లు పుల్వామాలో మరికొన్నిసార్లు అనంత్‌నాగ్‌లో సైనికులు అమరులయ్యారని చెప్పారు. ప్రధానికి భారత సైనికులపై కనికరం లేదని అన్నారు.
Read Also: Uttar Pradesh: కోడలిపై మామ అత్యాచారం.. విడిచిపెట్టిన భర్త..
కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలు చుట్టూ పడి ఉన్నాయని.. ఆ సమయంలో ప్రధాని బెంగాల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారని సంజయ్ సింగ్ గుర్తుచేశారు. దేశ భద్రతతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం సంతాపం తెలిపేందుకు సిద్ధంగా లేదని దేశ ప్రజలు తెలుసుకోవాలన్నారు. పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులకు ప్రధాని తగిన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్‌లో లేవనెత్తుతుందని చెప్పారు.
Read Also: Meenakshi Chaudhary: నక్కతోక తొక్కావా ఏంది? అప్పుడే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ పట్టావ్?
ఇదిలా ఉంటే.. సనాతన్ వివాదంపై సంజయ్ సింగ్ స్పందించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. సనాతన్, హిందూ మతం గురించి మోడీ.. హిందూ మతం లేదు అని చెబుతున్నాడని.. సనాతన్‌పై వ్యాఖ్యానించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. అన్ని మతాల మధ్య సమన్వయం, సౌభ్రాతృత్వం ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా చెప్పారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనపై దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో బీజేపీ.. ప్రతిపక్ష కూటమి I.N.D.I.A పై విమర్శల దాడికి దిగిన విషయం తెలిసిందే.