Mallikarjun Kharge: జీ-20 సమావేశం ముగిసింది.. దేశ సమస్యలపై దృష్టి పెట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్ట్ చేస్తూ.., 2024లో మోడీ ప్రభుత్వం నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని విమర్శించారు. మరోవైపు జీ-20 సమావేశాలు ముగిసాయి. ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని ఖర్గే అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి కూడా ప్రస్తావించారు. “ఆగస్టులో సాధారణ ప్లేట్ ఫుడ్ ధర 24 శాతం పెరిగింది” అని ట్విట్టర్(X) లో రాసుకొచ్చారు. అంతేకాకుండా.. దేశంలో నిరుద్యోగం 8 శాతానికి చేరుకుందని.. యువత భవిష్యత్తు అంధకారమైందని తెలిపారు.
Read Also: Nara Family: చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ రద్దు..
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
మోడీ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల అవినీతి వెల్లువలా వచ్చిందని ఖర్గే ఆరోపించారు. కాగ్ అనేక నివేదికల్లో బీజేపీని బట్టబయలు చేసిందని.. జమ్మూకశ్మీర్‌లో రూ.13000 కోట్ల జల్‌జీవన్ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అవినీతిని బయటపెట్టినందుకు దళిత ఐఏఎస్ అధికారిపై వేధింపులు జరిగాయని ఖర్గే పేర్కొన్నారు. ప్రధాని ప్రాణ స్నేహితుడి దోపిడీ ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఆర్‌బీఐ ఖజానా నుంచి రూ.3 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వానికి బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఒత్తిడిని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యతిరేకించారు. దీంతో ఈ బండారం బయటపడిందని చెప్పారు.
Read Also: IND vs PAK: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. వదలని వరుణుడు
ఇదిలా ఉంటే.. మణిపూర్‌లో మళ్లీ హింస జరిగింది. హిమాచల్‌ప్రదేశ్‌లో విపత్తు సంభవించింది. అయితే అహంకారపూరిత మోడీ ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించకుండా తప్పించుకుంటుందని ఖర్గే దుయ్యబట్టారు. వీటన్నింటి మధ్య మోడీ నిజాన్ని కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కానీ ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని చెదరగొట్టే సమస్యలకు బదులుగా వాస్తవాన్ని వినాలని, చూడాలని కోరుకుంటున్నారని ఖర్గే తెలిపారు. 2024లో బీజేపీ నిష్క్రమణకు ప్రజలు మార్గం సుగమం చేయడం ప్రారంభించారని మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
-
Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
-
Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
-
Success Story: యూపీఎస్సీ కోసం 16 ప్రభుత్వ ఉద్యోగాలను తిరస్కరించింది.. కట్ చేస్తే ఐపీఎస్..
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!