భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలు, నియమాల వల్ల కొందరు ఆయనకు వీరాభిమానులుగా మారారు.. దేశ, విదేశాల్లో ఆయనకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరల్డ్ వైడ్ గా మోదీ పేరు అంటే తెలియనివారు ఎవరూ ఉండరు. మోదీ అంత క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే మోదీకి అనేకమంది అభిమానులు సర్‌ప్రైజ్‌లు ఇస్తూ ఉంటారు.. ఆయన పై అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.. గతంలో చాలామంది ఆయనకు ప్రత్యేమైన గిఫ్ట్ లను పంపించారు..
తాజాగా మోదీ వీరాభిమాని అతనికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు.. అత్యంత ఖరీదైన గిఫ్ట్ అందించాడు…ఏకంగా 7200 వజ్రాలతో ప్రధాని ఫొటో తయారుచేశాడు. మోదీకి ఈ అరుదైన గిఫ్ట్ ను అభిమాని ఇవ్వబోతున్నాడు. సెప్టెంబర్ 17న మోదీ తన పుట్టినరోజుని జరుపుకోనున్నారు. ఈ పుట్టినరోజు మోదీ 73వ పుట్టినరోజు బర్త్ డే సందర్బంగా మోదీకి ఒక అభిమాని అరుదైన గిఫ్ట్ ఇవ్వనున్నాడు. సూరత్‌కి చెందిన విపుల్ జేపీవాలా అనే వ్యక్తి మోదీకి వీరాభిమాని..
అతను ఒక అర్కిటేక్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.. అలాగే కొద్దికాలంగా వజ్రాలతో పెయింటింగ్ లు వేయడం ప్రారంభించాడు. అందులో భాగంగా దాదాపు మూడున్నర నెలలు కష్టపడి మోదీ చిత్రపటాన్ని తయారుచేశాడు. మూడు వేర్వేరు రంగుల వజ్రాలను ఈ ఫొటో తయారుచేయడానికి వాడాడు.. మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జొబైడెన్ భార్యకు వజ్రాలు పొదిగిన క్రాఫ్ట్ ను బహుమతిగా ఇచ్చాడు. దానిని చూసి తర్వాత ప్రధాని మోదీ ఫొటోలను రూపొందించాలనే ఆలోచన వచ్చినట్లు ఈ అభిమాని చెబుతున్నాడు.. ఈ వజ్రాలు ఎప్పటికి ఊడిపోకుండా ప్రత్యేకమైన గమ్ తో అతికించాడు..అంతేకాదు ఎక్కువకాలం చిత్రపటం నుంచి విడిపోకుండా ఉండేలా వజ్రాలను కూడా తీసుకున్నాడు.. ఆ ఫోటో ఫ్రెమ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి..