ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీటితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు దృష్టి పెట్టారు. అంతేకాకుండా.. ఇండియా, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ తొలి సమావేశం మినిట్స్‌పై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. ద్వైపాక్షిక సమావేశంలో పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. 2019 ఫిబ్రవరి తర్వాత సౌదీ యువరాజు భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి. జీ20 సదస్సు కోసం ఆయన సెప్టెంబర్ 8న ఢిల్లీకి వచ్చారు. మహ్మద్ బిన్ సల్మాన్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు.
Pushpa 2 The Rule: రూల్ చేసేందుకు ‘పుష్ప’గాడు దిగుతున్నాడు..రిలీజెప్పుడో చెప్పేశారు!
హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో సమావేశానికి ముందు.. సౌదీ అరేబియా యువరాజుకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారికంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిన్ సల్మాన్ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను G20 శిఖరాగ్ర సమావేశం నిర్వహించినందుకు భారతదేశాన్ని అభినందించాలనుకుంటున్నానని తెలిపారు. సదస్సులో చేసిన ప్రకటనల వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందన్నారు. ఇరు దేశాలకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని క్రౌన్ ప్రిన్స్ తెలిపారు.
Tiger Nageshwara Rao : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా..
ద్వైపాక్షిక సమావేశంలో రాజకీయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకారం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా, భారత్ మధ్య సంబంధాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయన్నారు. సమావేశం అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కావడంతో, మొత్తం ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం పరస్పర సమన్వయం అవసరమన్నారు. తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్చల్లో పలు కార్యక్రమాలను గుర్తించామన్నారు. నేటి చర్చలు మన సంబంధాలకు కొత్త శక్తిని, దిశను అందిస్తుందని తెలిపారు. ఇది మానవజాతి సంక్షేమం కోసం కలిసి పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని మోడీ అన్నారు.
Heroin in Soap Box: సబ్బుపెట్టెలో హెరాయిన్ .. ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్
భారత్, పశ్చిమాసియా, యూరప్‌ల మధ్య చారిత్రక ఆర్థిక కారిడార్ అయిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ కనెక్టివిటీ కారిడార్ గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నిన్న, చారిత్రక ఆర్థిక కారిడార్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. ఈ కారిడార్ రెండు దేశాలను అనుసంధానం చేయడమే కాకుండా, ఆసియా, పశ్చిమాసియా, యూరప్ మధ్య ఆర్థికాభివృద్ధి మరియు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో కూడా సహాయపడుతుందని ప్రధాని అన్నారు. మీ నాయకత్వం, విజన్ 2030 సౌదీలో అద్భుతమైన ఆర్థిక వృద్ధిని చూపుతున్నాయని తెలిపారు. పశ్చిమాసియాలో భారతదేశం యొక్క ప్రధాన వ్యూహాత్మక భాగస్వాములలో సౌదీ అరేబియా ఒకటని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య మొత్తం సంబంధాలలో గణనీయమైన వృద్ధి కనిపించిందని.. ఇరుపక్షాలు కూడా తమ భద్రతా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు.