Akbaruddin Owaisi: యోగి పేరుతో, మోడీ పేరుతో, అమిత్ షా పేరుతో, భగవాన్ రాంజీ పేరుతో ఓట్లు రాక పోవటంతో ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ పేరుతో ఓట్లు దండు కోవాలని చూస్తున్నాడని చాంద్రాయణగుట్ట ఎంఎల్ఏ అక్బర్ ఉద్దీన్ ఓవైసీ మండిపడ్డారు.
సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతీయ ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ లోని ఐఐటీ(IIT), ఐఐఎం(IIM)ని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలం గురించి చర్చించారు.
మహారాష్ట్రలోని శివసేన(యూబీటీ)పై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నకిలీ శివసేన నాయకులు తనను మట్టి కరిపిస్తామంటూ కలలు కంటున్నారన్నారు. ఈ నకిలీ శివసేన నాయకులు తనను సజీవ సమాధి చేయాలని మాట్లాడుతున్నారన్నారు.
జేపీ ప్రచారం జోరు పెంచింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరగనున్న సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలుంటాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కేంద్రంపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి ఆర్థికవ్యవహారాల సలహా మండలి(ఈఏసీ–పీఎం) నివేదికలోని గణాంకాలపై తేజస్వీ యాదవ్ సందేహం వ్యక్తంచేశారు.
2019లో జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడిన రోజది.
ఈ రోజు లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. మూడో దశ ఓటింగ్ లో రాష్ట్రం కూడా ఉంది. తన కుటుంబంతో సహా అహ్మదాబాద్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాన్య పౌరుడిలా వరుసలో నిలబడి ఓటు వేశారు.
భారతీయుల రాకతో టూరిజం పరంగా అభివృద్ధి చెందిన మాల్దీవులు ఇప్పుడు కుదేలు పడుతోంది. భారత టూరిస్టులు మాల్దీవులకు బదులుగా లక్షదీప్ కు వెళ్తుండటంతో మల్దీవులు పర్యాటకం దివాళా తీసింది.
లోక్‌సభ ఎన్నికలు కీలక దశకు చేరుకున్న వేళ మోడీ సర్కార్‌పై బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ క్యాబినెట్లో ఇద్దరు (రాజ్‌నాథ్, గడ్కరీ) తప్ప.. మిగతా వారంతా ‘యెస్’ అంటూ తలూపేవారేనని విమర్శించారు.
గుజరాత్ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ కంచుకోటగా తరచుగా ప్రశంసిస్తుంటారు. 2019లో దాని అద్భుత విజయం సాధించి మరోసారి ప్రతిభ చాటింది. ఇక్కడ అది వరుసగా రెండవసారి మొత్తం 26 స్థానాలను గెలుచుకుంది.