చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కార్యాలయానికి బుధవారం (మే 22, 2024) రాత్రి ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడు. దీంతో ఎన్ఐఏ ఒక్కసారిగా హైఅలర్ట్ అయింది. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన ఓ వ్యక్తి.. ‘‘ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఓ చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేస్తాం’’ అని వార్నింగ్ ఇచ్చాడు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమితో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పన్స్కురాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న దీదీ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తమ పార్టీ తృణమూల్ కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తే.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే భారత కూటమికి పూర్తిగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున మరోసారి ఖర్గె ఫైరయ్యారు. మోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ " కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపుతారు" అని వ్యాఖ్యానించారు.
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్ను ప్రశంసించారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సౌత్ సినిమాలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా బాగా పాపులర్ అయ్యింది. రష్మిక గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చివరిగా రణబీర్ కపూర్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'యానిమల్'లో కనిపించింది.
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సీట్ల పంపకంలో తేడా రావడంతో ఇండియా కూటమితో విభేదించిన ఆమె ప్రస్తుతం ఆ కూటమికి జై కొట్టారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ బయటి నుంచి మద్దతు ఇస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, 'ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది' అని రాశారు.
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు.