Tejasvi Surya: రాహుల్ గాంధీతో చర్చకు బీజేవైఎం సిద్ధం.. అభినవ్ ప్రకాశ్ పేరు ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాశ్ పేరును సోమవారం నామినేట్ చేసింది. భారతీయ జనతా యువమోర్చా ప్రెసిడెంట్ తేజస్వి సూర్య రాహుల్ గాంధీకి రాసిన లేఖలో, ‘ఇది రాజకీయ కుటుంబానికి చెందిన వారసులు, సాధారణ యువకులకు మధ్య గొప్ప చర్చ అవుతుంది’ అని రాశారు. బహిరంగ చర్చకు ఆహ్వానిస్తూ.. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎపి షాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై సీనియర్ జర్నలిస్టు ఎన్. రామ్ కూడా సంతకం చేశారు. బహిరంగ చర్చకు ఆహ్వానాన్ని స్వీకరిస్తూ ప్రధాని ఇందులో పాల్గొంటారని దేశం ఆశిస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, రాహుల్ గాంధీకి కాంగ్రెస్‌లో కూడా విశ్వసనీయత లేదని, మోడీతో చర్చించడానికి ఎలాంటి అర్హత లేదని బీజేపీ చర్చా ఆహ్వానాన్ని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఈ చర్చకు బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఆ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు అభినవ్ ప్రకాష్ పేరును ఖరారు చేస్తూ.. కాంగ్రెస్ కు లేఖ రాశారు. ఈ లేఖను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
READ MORE: Palnadu: పల్నాడు జిల్లాలో టెన్షన్.. టీడీపీ- వైసీపీ నేతల మధ్య మరోసారి వివాదం..!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
‘మీ ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించిన రాజకీయ కుటుంబానికి చెందిన వారసుడు, ప్రధాని నరేంద్ర మోడీ న్యూ ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక చారిత్రాత్మక చర్చకు వేదిక సృష్టించవచ్చు.” అని తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. అభినవ్ ప్రకాష్ పాసి ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా విద్యావంతుడని తన లేఖలో పేర్కొన్నారు. ఇంతలో, అభినవ్ ప్రకాష్ తనతో రాహుల్ గాంధీ చర్చకు సిద్ధంగా ఉంటారని ఆశిస్తున్నట్లు ఎక్స్‌లో రాశారు. అభినవ్ ప్రకాష్ తన X పోస్ట్‌లో, ‘నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు తేజస్వి సూర్య. రాహుల్ గాంధీ నాతో చర్చకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పాలన, ఉపాధి ఇలా అన్ని విషయాలపై బహిరంగ చర్చ జరగాలి.” అని రాసుకొచ్చారు.
Dear Rahul Gandhi Ji,
BJYM has deputed Sri @Abhina_Prakash, our VP, to debate with you.
He is a young and educated leader from the Pasi (SC) community, who are around 30%, in Rae Baraeli.
It will be an enriching debate between a political scion and a common youngster who… pic.twitter.com/8FarSmqrQe
— Tejasvi Surya (ಮೋದಿಯ ಪರಿವಾರ) (@Tejasvi_Surya) May 13, 2024
- Tags
- Abhinav Prakash
- bjp
- Bjym
- congress
- modi
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!