కాంగ్రెస్ ఏడాది పాలనలో హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ప్రజల వికాసానికి బీజేపీ పనిచేస్తుందని.. కాంగ్రెస్ పార్టీ వాళ్ల స్వలాభం కోసం పని చేస్తుందని అన్నారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత గురించి విన్నామని.. మోడీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ అనుకూలత గురించి వింటున్నామన్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బీజేపీ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగించారు
నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివ్రుద్ది చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగాలాండ్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ అందులో భాగంగా ఈరోజు (మంగళవారం) మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు.
స్క్రాప్‌ల విక్రయం ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. గత కొన్నేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 3 ఏళ్లలో స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2,364 కోట్లను ఆర్జించినట్లు పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం (DPIIT) తెలియజేసింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో వెలువడిన వ్యర్థాలు విక్రయించారు.
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్‌లో భారతీయ విద్యా భవన్‌లో జరిగిన రోజ్‌గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా…
భారత్ భద్రత కోసం తాజాగా పెద్ద అడుగు వేసింది. రెండు కొత్త అణు జలాంతర్గాముల నిర్మాణానికి భారత్ ఆమోదం తెలిపింది. ప్రధాని నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ రెండు స్వదేశీ అణు జలాంతర్గాములను నిర్మించేందుకు అనుమతి ఇచ్చింది.
పంజాబ్‌తో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న బంధాన్ని ఇలాంటి నిరాధారమైన, అశాస్త్రీయమైన వ్యాఖ్యల ద్వారా అంచనా వేయవద్దని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ తెలిపారు.
Jagga Reddy: కులం పేరుతో..మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ...ఇందిరమ్మ ల చరిత్ర వక్రీకరించి పనిలో కొందరు ఉన్నారని తెలిపారు.
కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో 'విభజన' ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.