Bandi Sanjay : మొకాక్ చుంగ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర మంత్రి
- నాగాలాండ్ లో ‘సంపూర్ణతా అభియాన్’పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమీక్ష
- ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని కోరిన కేంద్ర మంత్రి
- మారూమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో భేటీ
- కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగాలాండ్ డీజీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : నాగాలాండ్ సహా వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను సమగ్రాభివ్రుద్ది చేసేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నాగాలాండ్ లో పర్యటిస్తున్న బండి సంజయ్ అందులో భాగంగా ఈరోజు (మంగళవారం) మొకాక్ చుంగ్ జిల్లాలో పర్యటించారు. ఉదయం నాగాలాండ్ రాజధాని కొహిమా నుండి హెలికాప్టర్ లో మొకాక్ చుంగ్ కు చేరుకున్న బండి సంజయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సువిసీ ఫోజీ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సంపూర్ణతా అభియాన్ లో భాగంగా నీతి అయోగ్ ఎంపిక చేసిన ఆకాంక్షిత జిల్లాల జాబితాలో మోకాక్ చుంగ్ ఒకటి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర పథకాలు, కార్యక్రమాల అమలులో భాగంగా క్షేత్రస్తాయిలో ఎదురవువుతున్న ఇబ్బందులు, ప్రజల నుండి వస్తున్న ఫీడ్ బ్యాక్ ను అడిగి తెలుసుకున్నారు. జిల్లా సమగ్రాభివ్రుద్ది కోసం కేంద్రం నుండి అందించాల్సిన సహకారంపైనా సూచనలు తీసుకున్నారు. జిల్లాలోని విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, సంక్షేమం, రవాణా, జల్ శక్తి రంగాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. స్కిల్ డెవలెప్ మెంట్, సంక్షేమ పథకాల అమలుపైనా అధికారుల నుండి పలు వివరాలు సేకరించారు. మారుమూల ప్రాంతాల్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా అధికారులు మంత్రి ద్రుష్టికి తీసుకొచ్చారు. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, దీంతో గర్భిణీలు, విద్యార్ధులు తీవ్ర అవస్థ పడుతున్న విషయంపై ఆరా తీశారు. జిల్లా కేంద్రంతో నీటి కొరత వేధిస్తోందన్నారు. అట్లాగే స్కిల్ డెవలెప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా నాగాలాండ్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రానికి ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా నోట్ చేసుకున్నారు. అసోం రాష్ట్రంతో సరిహద్దు సమస్యపై నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని, వాటిని పరిష్కరించాలని అధికారులు సూచించగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
Strong Bones Calcium: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. క్యాల్షియం కొరత ఉండదు
Also Read
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Ram Lakshman Masters: 'ది ప్యారడైజ్' సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
- Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈసారి ‘ఆయిల్ పాం’ పంటలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్న జిల్లాలో రైతులను ఆయిల్ పాం పంటల సాగు చేసేలా ప్రోత్సహించాలని కోరారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి బడ్జెట్ లో 11 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్దిపట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందన్నారు. ఏటా రూ.2.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. నిధుల వినియోగం, కార్యక్రమాల అమలు తీరుపై 15 రోజులకు ఒకసారి ఆయా రాష్ట్రాల్లో సమీక్షిస్తోందన్నారు. అందులో భాగంగానే తాను వచ్చానన్నారు. కేంద్ర మంత్రిత్వశాఖలు ఖర్చు చేసే మొత్తం బడ్జెట్ లో 10 శాతం మేరకు ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్ధికే కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా నాగాలాండ్ సహా ఈశాన్య రాష్ట్రాలు అభివ్రుద్ధి చెందాలన్నదే మోదీ అభిమతమన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా సేవలన్నీ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అట్లాగే కనీస మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులోకి తేవడంతోపాటు మారుమూల అటవీ, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రతి కుటుంబానికి జల్ జీవన్ మిషన్ కింద తాగు నీటిని అందించేలా క్రుషి చేస్తామని తెలిపారు. అంతిమంగా ఈశాన్య రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ సంత్రుప్తికర స్థాయిలో (శాచ్యరేషన్) ప్రభుత్వ ఫలాలను అందించాలన్నదే మోదీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకోసం తగిన సహాయ సహకారాలు అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.
అనంతరం అధికారులతో కలిసి మొకాక్ చుంగ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం రూ.5 కోట్ల నిధులతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం జరుగుతున్న విషయాన్ని గుర్తించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి నూతన భవన నిర్మాణంలో ఆసుపత్రి సేవలు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం అధికారులతో కలిసి హెలికాప్టర్ లో కొహిమాకు తిరిగొచ్చిన బండి సంజయ్ కుమార్ ను నాగాలాండ్ రాష్ట్ర డీజీపీ రూపిన్ శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై కొద్దిసేపు చర్చించారు. మరోవైపు నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ ఈరోజు రాత్రి ఇచ్చిన డిన్నర్ లో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తో కొద్దిసేపు ముచ్చటించారు. నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిసహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ డిన్నర్ కు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Release Postpone : పెద్ద హీరోల సినిమా అంటే వాయిదా పడాల్సిందేనా?”
-
Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
-
Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
-
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్‌లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
-
Oracle Layoffs: ఏఐ డేటా సెంటర్ల కోసం భారీ ఖర్చు.. ఒరాకిల్‌లో మరోసారి పెద్ద ఎత్తున లేఆఫ్స్..?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!