Jagga Reddy: కులం పేరుతో..మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ…ఇందిరమ్మ ల చరిత్ర వక్రీకరించి పనిలో కొందరు ఉన్నారని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకుల…ఇవ్వాల దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. కులం పేరుతో.. మతం పేరుతో నేటి పాలకులు చిచ్చు పెడుతున్నారన్నారు. బ్రిటిష్ వాళ్ళ మాదిరిగానే… ఈనాటి పాలకులు కులం..మతం..వర్గాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని రాహుల్ గాంధీ ఆలోచన అన్నారు. అందుకే జోడో యాత్ర చేశారు రాహుల్ గాంధీ అని తెలిపారు.
Read also: Sunkishala Project: నేడు సుంకిశాల ప్రాజెక్టును సందర్శించనున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
గాంధీ కలలు కన్న రాజ్యం కోసం రాహుల్ గాంధీ.. అహింసా మార్గంలో పయనిస్తున్నారన్నారు. ఆస్తులు ప్రజల కోసం ధారాదత్తం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబం ది అన్నారు. అలాంటి గాంధీ కుటుంబం పై కుట్రలు చేస్తుంది మోడీ ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ చిత్రపటం.. కరెన్సీ నోటు మీద లేకుండా చేసే కుట్ర కూడా చేసింది బీజేపీ అని ఆరోపించారు. మోడీ పాలన అంతమొందించడానికి రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ కుటుంబం రాజకీయంగా లేకుండా చేయాలని చూశారు.. కానీ ప్రజలు ప్రతిపక్ష నాయకుడి గా కూర్చోబెట్టారన్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా కూర్చోపెట్టి న ప్రజలు.. వచ్చే ఎన్నికలలో ప్రధాని గా కుర్చోపెట్టబోతున్నారని అన్నారు.
Hyderabad Crime Update: చాకు నజీర్ తో కలిసి వస్తున్న రియాజ్ పై కాల్పులు.. మరి నజీర్ ఏమైనట్టు..?