కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా… తాజా పరిణామాలు చూస్తుంటే.. కేబినెట్ పునర్‌వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులతో…
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం అధికమైంది. పన్నుల మీద పన్నులు మోపుతున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ.. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల పేద ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించుకుంటే పేదలపై భారం తగ్గుతుంది. నిత్యావసర ధరలు…