కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ దేశవ్యాప్తంగా కుల గణనను సమర్థించారు. అయితే ఈ లెక్కలను బహిరంగపరచడం వల్ల సమాజంలో ‘విభజన’ ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’, ‘యూనిఫాం సివిల్ కోడ్’పై అధికార ఎన్‌డీఏలో ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అయితే..ఈ రెండు అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో భాగమే.
ఓ వార్తా సంస్థతో ప్రత్యేక సంభాషణలో యూసీసీ పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ముసాయిదాను తన ముందు ఉంచనంత వరకు తాను ఎలాంటి స్టాండ్ తీసుకోలేనని ఆయన తెలిపారు. అయితే.. తన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ‘ఒక దేశం, ఒకే ఎన్నికల’కు గట్టిగా మద్దతు ఇస్తుందని ఆయన నొక్కి చెప్పారు. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)కి మద్దతిస్తారా అని పాశ్వాన్‌ను అడిగినప్పుడు? అందుకే ఆయన స్పందిస్తూ.. “మా దగ్గర ఇంకా ముసాయిదా లేదు. ఆ ముసాయిదా చూసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. ఇప్పటికే ఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్త మవుతున్నాయి.” అని సమాధానమిచ్చారు.
READ MORE:Srisailam Project: శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు.. భారీగా పెరిగిన వరద ప్రవాహం
ఈ అంశంపై ఇంకా మాట్లాడుతూ.. “భారతదేశం భిన్నత్వం కలిగిన దేశం. అది భాష, సంస్కృతి లేదా జీవనశైలి కావచ్చు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. అందరినీ ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకురాగలరు. అయితే..యూసీసీ అమలు చేస్తే.. ముస్లింలకే నష్టం అన్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అది హిందువులపై కూడా దీని ప్రభావం పడవచ్చు. ఎందుకంటే వివాహానికి సంబంధించిన విషయాలు, పలు ఆచారాలు మరియు సంప్రదాయాలు దేశవ్యాప్తంగా భిన్నంగా ఉంటాయి.” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులను ఒకే గొడుగు కిందకు ఎలా తీసుకువస్తారు? కాబట్టి డ్రాఫ్ట్ వచ్చే వరకు.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేనని స్పష్టం చేశారు.