కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజెపి కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు కేటీఆర్. సాగు చట్టాలను రద్దు చేయడం.. మోడీ క్షమాపణలు చెప్పడం ఎన్నికల స్టంటేనని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. సాగు చట్టాలను రద్దు చేశామని మోడీ అంటారని… సాగు చట్టాలు మళ్లీ తెస్తామని కేంద్ర మంత్రి అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. బిజెపి రాజకీయాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని…
దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు. దేశం ఆర్థిక రంగంలో…
అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిల పెళ్లి వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. Read Also:అగ్ని ప్రైమ్ మిస్సైల్ పరీక్ష విజయవంతం…
సరిహద్దులో చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో మోడీ ప్రభుత్వం సీడీఎస్‌ను నియమించేందుకు సిద్ధం అవుతుంది. మరోవైపు ఇప్పటి వరకు సీడీఎస్‌గా ఉన్న బిపిన్ రావత్ మృతి చెందడంతో కొత్త సీడీఎస్‌గా ఎవరూ వస్తారనే దానిపై చర్చ ప్రారంభం అయింది. బిపిన్ రావత్ మరణంతో దేశం విషాదకర పరిస్థితులు ఉన్నా.. రక్షణ విషయంలో ఆలస్యం చేయకూడదని ప్రధాని మోడీ భావించారట. నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో కూడా ఈ విషయం పై చర్చించారని తెలుస్తుంది. త్రివిధ దళాలకు కొత్తగా ఎవరి…
2021 నవంబర్ 21 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఎస్‌కెఎం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది. ఈ నెల 7న సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం అవుతుందని, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఏడాదిగా రైతు ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్న ఢిల్లీ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢీల్లీల్లో సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. ఈ మేరకు ద్రవ్యోల్బణం, చమురు ధరల పెంపు, చైనా వివాదం, కాశ్మీర్ అంశంపై పార్లమెంట్‌లో కేంద్రాన్నిప్రశ్నించనున్నట్టు తెలిపారు. కాగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని పట్టు పట్టనుంది. కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయనున్నట్టు కాంగ్రెస్ నేత మల్లిఖార్జన ఖర్గే…
మొండి బకాయిలను చెల్లించని వారి నుంచి బ్యాంకులు సొమ్మును రికవరీ చేశాయని, వీటి విలువ రూ. 5 లక్షల కోట్లకు పైగా ఉంటుం దన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. “ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకుని పారి పోయినప్పుడు అందరూ చర్చించుకుం టారన్నారు. కానీ ధైర్యంగా ప్రభుత్వం వారి నుంచి తిరిగి తీసుకు వచ్చినప్పుడు, ఎవరూ దాని గురించి చర్చించరు” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. “మేము ఎన్‌పీఎల సమస్యను పరిష్కరించామన్నారు. బ్యాంకులకు…
బీజేపీ, ఆర్ఎస్ఎస్లతో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాజేష్ టికాయత్ హెచ్చరించారు. దేశ ప్రజల మధ్య ఐక్యతను విడదేసేందుకు వారు ఎంతకైనా తెగిస్తారని ఆయన విమర్శించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారం భించి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చలకు రాలేదని టికాయత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం చర్చలకు రావాలని, లేదంటే నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని…
కరోనా ఎంట్రీతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి అందరికీ తెల్సిందే. గత రెండుళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలైపోయింది. కరోనా దాటికి లక్షలాది మంది మృత్యువాతపడగా, కోట్లాది మంది ఉద్యోగాల్లేక వీధిన పడ్డారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు వారిపై మరింత పన్నుల భారం మోపుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్ ధరలు సామాన్యుడి జీవితాన్ని ప్రశ్నార్ధకంగా మారుస్తున్నాయి. చమురు కంపెనీలు…
కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.. తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం. రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం అని అన్నారు. జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు. రైతుల కోసం కొట్లడేది ఒక…