కార్పొరేట్ శక్తులను పెంచే పనిలో పడింది మోడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. కుల వృత్తులు కూడా కార్పొరేట్ శక్తులు చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న.. తెలంగాణ, ఏపీ లో ఆందోళనలు లేకపోవడం దురదృష్టకరం. రైతులు బయటకు రాకపోవడం కి పోలీసు కేసులు కారణం అని అన్నారు. జగన్, కెసిఆర్ పోలీసుల తో కేసులు పెట్టిస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై కనీసం జగన్, కెసిఆర్ మాట్లాడటం లేదు. రైతుల కోసం కొట్లడేది ఒక…
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం.. బడ్జెట్‌లో ప్రస్తావించినట్టుగానే బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. బ్యాడ్‌బ్యాంక్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.30,600 కోట్ల గ్యారెంటీ ఇస్తోందని ప్రకటించారామె.. బ్యాంకింగ్‌రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తున్నామన్న నిర్మలా సీతారామన్.. ఇప్పుడిప్పుడే బ్యాంకింగ్ రంగం కోలుకుంటుందన్నారు.. ఇక, ఎన్‌పీఏలను తగ్గించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు నిర్మలా సీతారామన్.. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.3 లక్షల కోట్ల మొండి బకాయిలను వసూలు చేశామని…
బాదితే.. అలా ఇలా కాదు.. జకీర్ హుస్సేన్ తబలా వాయించినట్లు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసినట్లు ఉండాలి అన్నట్లుగా మోదీ సర్కారు తీరు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తూ దానికి దేశభక్తి అనే ట్యాగ్ తగిలించడం బీజేపీకే సర్కారుకే చెల్లించిందని కాంగ్రెస్ వాదులు విమర్శిస్తున్నారు.. ప్రభుత్వాలు అప్పులు చేసినప్పుడు తిరిగి చెల్లించక తప్పదు. అలా చెల్లించే క్రమంలో ప్రజలపై ఏ రేంజులో బాదుతామో మోదీ సర్కారు అందరికీ అర్థమయ్యేలా…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేస్తున్న అంశం పెగాసస్… ఉభయసభల్లోనూ ఇదే వ్యవహారం రభస సృష్టిస్తోంది… పెగాసస్ వ్యవహారంపై ప్రభుత్వం చర్చించాల్సిందేనంటూ 9 రోజులుగా ప్రతిపక్షాలు ఉభయ సభలనూ స్తంభింపజేస్తున్నాయి. అలాగే 50 పని గంటల్లో 40 పనిగంటలను సభ కోల్పోయిందని అధికారికంగా ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు జరిగిన అవాంతరాల వల్ల 133 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.. అయితే, ప్రతిష్ఠంభన తొలగిపోయేందుకు ఏమాత్రం సూచనలు కూడా కనిపించడంలేదు.. పెగసస్ వివాదం కారణంగా,…
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన తొలిసారి సమావేశమైన కొత్త కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.. రూ.23,132 కోట్ల కరోనా నిర్వహణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బుధవారం కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయగా… రాత్రి శాఖలు కేటాయించారు ప్రధాని మోడీ.. ఇక, ఇవాళ సమావేశమైన కేంద్ర కొత్త మంత్రివర్గం.. కరోనా తాజా పరిస్థితులు, థర్డ్ వేవ్ ఎదుర్కోవడంపై చర్చించింది.. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితిని ఎదుర్కొవడంతోపాటు, థర్డ్ వేవ్‌కు సన్నద్ధమయ్యేందుకు కొత్త అత్యవసర ప్రతిస్పందన ప్యాకేజీ కింద రూ.23,132…
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ పూర్తి చేశారు ప్రధాని నరేంద్ర మోడీ… సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మంత్రుల జాబితా విడుదల చేశారు.. కొందరు పాత మంత్రులతో రాజీనామా చేయించగా.. మరికొందరికి ప్రమోషన్లు, శాఖల మార్పు ఉండబోతోంది.. కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకుంటారన్నది అత్యంత గోప్యంగా ఉంచినా.. చివరకు ఓ జాబితా మాత్రం విడుదలైంది.. ఆ జాబితా ప్రకారం నరేంద్ర మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నవారి పేర్లను పరిశీలిస్తే… నారాయణ రాణే సర్బానంద్ సోనోవాలా…
తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ విస్తరణలో ప్రమోషన్ దక్కింది.. సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన ఆయనకు నరేంద్ర మోడీ 2 సర్కార్‌లో సహాయమంత్రి పదవి దక్కగా.. తాజా కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన కేబినెట్ మినిస్టర్ అయ్యారు.. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనుండగా.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి భనన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.. మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు…
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.. రేపు సాయంత్రం 5.30 – 6 గంటల మధ్య కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది.. కనీసం ఆరుగురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాలు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.. మొత్తంగా 20 మందికి పైగా కొత్తవారికి బెర్త్‌లు దక్కే అవకాశం ఉందని సమాచారం.. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కొచ్చని చెబుతున్నారు.. కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు.. పాత మంత్రులకు షాక్…
కేంద్ర కేబినెట్ విస్తరణపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా… తాజా పరిణామాలు చూస్తుంటే.. కేబినెట్ పునర్వ్యవస్తీకరణకు సర్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది… ఎల్లుండే భారీ విస్తరణ జరగనున్నట్టు సమాచారం.. నరేంద్ర మోడీ కేబినెట్‌లో 20 మందికి పైగా కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలతో పాటు.. పెద్ద రాష్ట్రాలకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. కేబినెట్ విస్తరణపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శులతో…
నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పన్నుల భారం అధికమైంది. పన్నుల మీద పన్నులు మోపుతున్నారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేస్తూ.. కార్పొరేట్ శక్తులకు రాయితీలు ఇస్తున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరల పెరుగుదల పేద ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుంకాలు తగ్గించుకుంటే పేదలపై భారం తగ్గుతుంది. నిత్యావసర ధరలు…