దేశంలోని కీలక కంపెనీల సీఈఓలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది బడ్జెట్ దృష్ట్యా సీఈఓల సలహాలు, సూచనలను మోడీ తీసుకున్నారు. దేశ ఆర్థిక వృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కార్పొరేట్ సెక్టార్‌కు కేంద్రం అందిస్తున్న ప్రోత్సహాకాలను సీఈఓలకు వివరించారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలని సూచించారు. రక్షణ రంగంలో కొత్త సాంకేతికత ఆవశ్యకతపై చర్చించారు.ప్రధానంగా దేశంలో నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టేలా ఆయా కంపెనీల సీఈఓలకు ప్రధాని మోడీ సూచించారు.
దేశం ఆర్థిక రంగంలో ఎదిగేలా కృషి చేయాలన్నారు. ఆయా సంస్థలు ఉపాధి కల్పనలపై కూడా దృష్టి సారించాలని మోడీ పేర్కొన్నారు. దేశంలో యువతకు మంచి అవకాశాలు సృష్టిస్తూ వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రముఖంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం ప్రోత్సహకాలను అందజేస్తుందని మోడీ తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో కార్పొరేట్ రంగానికి పెద్ద పీట వేయడానికేమోడీ సమావేశం నిర్వహించారని అటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.