MLC Kavitha: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్‌లోని బాలబ్రహ్మేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కవిత జోగులాంబ దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న కవితకు అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఎమ్మెల్సీ కవితకు వేద అనువాదాన్ని అందించారు. అధికారులు ప్రసాదాలు అందజేశారు. అయితే స్వామిని దర్శించుకునేందుకు ఎమ్మెల్సీ కవిత కారులో ఉదయం పయనమయ్యారు. ఉదయం సూర్య కిరణాలను తన మొబైల్ బంధించి కారులో ప్రయాణిం చేస్తూనే చూపిస్తూ వీడియో తీశారు. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ప్రయాణం చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ మహా శివరాత్రి సందర్భంగా అలంపూర్ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి బయలుదేరారు !! మీ అందరికీ, సంతోషం చేరుకూరాలని కోరుకుంటూ.. మహా శివ రాత్రి శుభాకాంక్షలు !! అంటూ పోస్ట్ చేశారు. సూర్య కిరణాలు తన వేలుతో చూపిస్తూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
On the occasion of Mahia Shivratri .. headed to Alampur Bala Bramheshwara Swamy Temple !! Wish you all a happy and blessed Maha Shiva Rathri !! 🙏 pic.twitter.com/VDp4qBSLTM
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2023
Read also: Harish Rao: యాదాద్రి, కొండగట్టు తరహా ఏడుపాయలు.. పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి..
రోడ్డు మార్గంలో తుంగభద్ర నది ఒడ్డున జోగులాంబ ఆలయం 5వ శక్తిపీఠం అని, స్థానిక జానపద కథలు, బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసాడని పేర్కొన్నారు. శివుడు 9 విభిన్న రూపాలలో కనిపిస్తాడని తెలిపారు. కాబట్టి ఈ పురాతన ఆలయ పట్టణంలో 9 శివాలయాలు, ఒక దేవి ఆలయం ఉన్నాయని కవిత తన సోషల్ మీడియాలో ఆ టెంపుల్ ఫోటోను షేర్ చేశారు.
While on the road … on the banks of river tungabadhra, jogulamba temple is 5th shakthibpeetam. Local folklore:lord Brahma did a penance here & lord shiva appears in 9 different forms .. so their are 9 shiva temples & one Devi temple in this ancient temple town. pic.twitter.com/BROhBYfFSh
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 18, 2023
Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్