MLA Jaggareddy: నేను స్పీచ్ రాసుకుని వచ్చాను కానీ.. వివేకానంద మాట్లాడితే మర్చిపోయా అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైరికల్ వేస్తూనే అసెంబ్లీలో జగ్గారెడ్డి ప్రసంగం మొదలు పెట్టారు. BRS ఎమ్మెల్యే వివేకానంద ఏ సమస్యలు లేవు అన్నట్టు మాట్లాడారని, నేను స్పీచ్ రాసుకుని వచ్చా కానీ.. వివేకానంద మాట్లాడిన తర్వాత మర్చిపోయా అంటూ వ్యంగాస్త్రం వేశారు. కేసీఅర్ కిట్ మంచి కార్యక్రమమే అంటూ మాట్లాడిన జగ్గారెడ్డి.. క్యాన్సర్ పేషెంట్ ల గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నారని అన్నారు. యాదాద్రికి మెట్రో రైల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. గవర్నర్ ప్రసంగంలో రాలేదు అంటూ చెప్పారు.
Read also: MLC Kavitha: మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే
రైతు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. పేదవాళ్ళకి 100 గజాల ఇళ్ల స్థలం ఇచ్చే జీవో మళ్ళీ తీసుకురావాలన్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముభరక్ మంచి స్కీములని అన్నారు. ఈ స్కీంకు మరో రెండు లక్షలు అదనంగా ఇవ్వండి అని జగ్గారెడ్డి తెలిపారు. అన్ని జరుగుతున్నాయి అని మీరు అనుకుంటే కరెక్ట్ కాదని తెలిపారు. సంగారెడ్డి వరకు మెట్రో సౌకర్యం కల్పించాలని అన్నారు. హైదరాబాదులో తరచుగా ఈడి ఐటి దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఇదేం పంచాయతీ తెలవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లేమో ఐటి ఈడిని పంపుతున్నారు.. టైం వస్తే పోలీసులను మీరు మా పైకి పంపిస్తారు అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అంతా కుప్పకూలిపోతుందని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి.
KTR: ఇటువైపు ఉన్నప్పుడు బాగానే ఉన్నారు.. అటు వెళ్లాక మారిపోయారు