కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత మరోసారి విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. అదానీ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్లు తీసుకున్నారని, అదానీ సంపద పడిపోవటంతో 18 వేల కోట్ల ఎల్ఐసి షేర్లు పడిపోయాయని ఆమె ఆరోపించారు. సామాన్య మధ్య తరగతి ప్రజలు ఓ వ్యక్తి దురాగతంతో ఇబ్బందుల్లో పడ్డారని ఆమె మండిపడ్డారు. అదానీ విషయంలో మోదీ మౌనం ఏంటని ఆమె ప్రశ్నించారు. మా పార్టీ ఎంత ఆందోళన చేస్తున్న ఈ విషయంపై ప్రస్తావనే లేదని ఆమె మండిపడ్డారు. పేద ప్రజల మీద ఆలోచన లేని మోదీ ప్రధానిగా అవసరమా అని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. 11 కోట్ల కిసాన్ యోజన నిధులు వేశామని సభ సాక్షిగా ప్రధాని అబద్ధాలు చెప్పారని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు.
Also Read : AP Crime: దృశ్యం సినిమా స్టోరీని మరిపించే ట్విస్ట్.. కొడుకును కొట్టి చంపిన తల్లి..!
3.87కోట్ల మంది రైతులకే నగదు సాయం అందిస్తోందని కవిత పేర్కొన్నారు. ఏటా నగదు సాయం లబ్ధిపొందే రైతుల సంఖ్యను కేంద్రం కుదిస్తూ వస్తోందని ఆరోపించారు. అదానీ విషయంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని బిఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నామని కవిత అన్నారు. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కవిత. ప్రధాని ప్రతిపక్షాలను అవహేళన చేస్తే ప్రశ్నించటం మానేస్తారనీ అనుకుంటున్నారని, అవహేళన చేయటం ఇది మొదటిసారి కాదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్టేషన్ కు రేవంత్ మాటలు నిదర్శనమని కవిత ధ్వజమెత్తారు. పీసీసీ అధ్యక్షుడుగా ప్రగతి భవన్ పై వ్యాఖ్యలు చేయటం అన్యాయమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Brain Health: నోటి అపరిశుభ్రత మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. తాజా అధ్యయనంలో వెల్లడి