బీజేపీ 2014,19 మేనిఫెస్టో లో మహిళ రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇంకో రెండు సెషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి ప్రస్తావన తీసుకురావాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..
మహిళల రిజర్వేషన్ పైన భారత జాగృతి అధ్వర్యంలో మార్చి 10న ఢిల్లీ లో ధర్నా చేయబోతున్నామని ఆమె వెల్లడించారు. ఇచ్చిన హామీ కేంద్రం నెరవేర్చలేదని, బీజేపీ వచ్చినప్పటి నుండి జనాభా గణన చేపట్టలేదన్నారు.
OBC గణన చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read : Laya: పవన్ భోజనం చేయమన్నా చేయలేదు.. రావడమే గొప్ప అంటూ
మార్చి 10న జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు నిరాహారదీక్ష చేపడుతున్నట్లు కవిత పేర్కొన్నారు. పార్లమెంట్ సెకండ్ సెషన్ ప్రారంభం అవుతుంది కాబట్టి పోలీసులు తక్కువ సమయం ఇచ్చారని, రాబోయే పార్లమెంట్ సెషన్స్ లో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టాలనీ మేము డిమాండ్ చేస్తున్నామన్నారు కవిత. దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ మహిళ నాయకులు హాజరవుతారని, మాతో కలిసొచ్చే వారందరినీ ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని పార్టీలకు ఆహ్వానం పంపినట్లు ఆమె తెలిపారు. మహిళ పక్షపాత పార్టీలు రావాలని ఆమె కోరారు.
Also Read : Vijayapriya Nithyananda: ఎవరీ విజయప్రియ నిత్యానంద.. ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించే చర్చ..