MLC Kavitha Fires On Central Budget: ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. మోడీ ప్రభుత్వం విఫలమైందని అనడానికి ఈ బడ్జెటే ఉదాహరణ అని విమర్శించారు. ఇది కేవలం కొన్ని రాష్ట్రాలకు చెందిన బడ్జెట్‌లా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. రూ.10 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పిస్తారని తాము ఆశించామన్నారు. ఎందుకంటే.. తెలంగాణలోని ఉద్యోగులకు తాము మంచి జీతాలు ఇస్తున్నామని, కానీ కేంద్రమంత్రి ప్రకటించిన రిబేట్ వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదని మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు మాత్రమే లబ్ది చేకూరేలా డెవలప్మెంట్ ప్రాజెక్టులను కేంద్రం ప్రకటించిందన్నారు. మౌళిక సదుపాయాల కల్పన కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పారని, కానీ అవి ఎలాంటి మౌళిక సదుపాయాలో బడ్జెట్‌లో వెల్లడించలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల వరకు రుణపడి ఉందని, ఆ బాకీలను చెల్లించాలని ఆర్ధికమంత్రిని కవిత డిమాండ్ చేశారు.
Virushka: ఆఖరికి ప్రియాంక కూడా చూపించేసింది.. మీరెప్పుడు చూపిస్తారయ్యా
ఇదిలావుండగా.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. దీంతో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన మహిళా మంత్రిగా అరుదైన ఘనత సాధించారు. అంతేకాదు.. సీతారామన్ ఇప్పటివరకు చేసిన బడ్జెట్ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం కొనసాగింది. కేంద్ర బడ్జెట్‌ను 87 నిమిషాల్లో పార్లమెంటు వేదికగా ప్రజల ముందు ఉంచారు. అంతకుముందు.. అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21 బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 (2 గంటల 42 నిమిషాలు) నిమిషాల పాటు ప్రసంగించారు. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం.. నిడివిపరంగా రెండో అతిపెద్దది.
Buggana Rajendranath Reddy: గుడ్ బడ్జెట్.. మా నాలుగు సూచనలు కేంద్రం పాటించింది..