తెలంగాణ సీఎం కేసీఆర్ గన్ అయితే.. ప్రభుత్వ ఉద్యోగులు బుల్లెట్లు అంటూ అభివర్ణించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. టీఎన్జీవో డైరీ ఆవిష్కరణ సభలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.. ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికలు జరుగుతాయి.. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల వల్లే దేశం బాగుందన్నారు.. వారి కష్టం వల్లే దేశం ముందుకు నడుస్తోందన్న కవిత.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యోగులు ఆ రోజు…
బాక్సింగ్ ఛాంపియన్, అర్జున అవార్డు గ్రహీత నిఖత్ జరీన్ ఈ రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఇటీవల అందుకున్న అర్జున అవార్డును, జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గోల్డ్ మెడల్‌ను ఎమ్మెల్సీ కవితకు చూపించారు.
బీఆర్ఎస్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా చర్చ మొదలైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులతో బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది పేదల కోసమేనని అన్నారు.
బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను ప్రశ్నించిన సీబీఐ బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది.