తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు. Also Read: Ramanthapur SBI: రామంతపూర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఘరానా మోసం.. కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ మేనేజర్లు! శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్…
ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని కేటీఆర్ మాట్లాడితే ఆశ్చర్యంగా అనిపిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలు మా మధ్య పుల్లలు పెడుతున్నారని.. సీతక్క ఆడ బిడ్డలందరికీ ప్రతీక అని ఆయన అన్నారు. సీతక్క అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోర్ట్ ఫోలియో నిర్వహిస్తున్నారన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న…
జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నా ప్రజా జీవితం ప్రారంభించింది ధరూర్ గ్రామం నుండే అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంత ఎపుడు జీవన్ రెడ్డి కి అండగా నిలుస్తుంది, బిఆర్అస్ ప్రభుత్వానికి గ్రామీణ ప్రాంతంపై విశ్వాసం లేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వస్తాయి పోతాయి.. ఎన్నికలలో నేను…
సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని…
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ప్రజా పాలనను కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ తాటివర్తి జీవనరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం అవకతవకలపై న్యాయ విచారణ చేపడుతామన్నారు. కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ సీబీఐ విచారణ చేపట్టాలంటోందని ధ్వజమెత్తారు. తుమ్మడి హెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై పారదర్శకంగా వాస్తవాలను వెలికితీసేందుకే న్యాయవిచారణ చేపట్టాలన్నారు జీవన్ రెడ్డి. లిక్కర్ స్కాం విచారణను ప్రజలు…
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కేంద్రాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని చెప్పి, తెలంగాణ హక్కులను భంగం కలిగించే విధంగా 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ఇదిలా ఉంటే.. ఫ్రీ…
గత ప్రభుత్వం లేఖలకే పరిమితం అయింది అంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది కమిషన్ ప్రాజెక్ట్.. మిషన్ భగీరథ తో జనాలకు ఒరిగింది ఏమి లేదు.. అనవసర ప్రాజెక్ట్ లు కట్టి రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారు అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.