సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకున్నారని తెలిపారు. గత నియంతృత్వ ప్రభుత్వానికి చరమగీతం పాడారన్నారు. రేపు దేశంలోనూ ఇదే పరిస్థితి వస్తుంది.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలి..
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. తెలంగాణలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్టు.. దేశంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని జీవన్ రెడ్డి చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగిందని.. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను ఆదుకుంటారని చెప్పారు. ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగదని.. రైతులకు, సామాన్య ప్రజానీకానికి న్యాయం చేస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Gyanvapi Case: జ్ఞానవాపి కేసులో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ.. పూజల కొనసాగింపుకే హైకోర్టు మొగ్గు..