MLC Jeevan Reddy : తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో నంబర్ వన్ 420 కేసీఆర్ అని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మోసగాడు అని అందరు మోసగాళ్లు అనుకుంటే ఏట్లా కేటీఆర్ అని జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నెల రోజులోనే హామీలని అమలు చేయలేదని కాంగ్రెస్ 420 అని కేటీఆర్ అనడం ఆశ్చర్యంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మొదటగా దళితులని మోసం చేసారని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి అని మరోసారి మోసం చేసారని, మీరు ఇచ్చిన హమీలని ఒకసారి నెమరవేసుకోండి కేటీఆర్ అని జీవన్ రెడ్డి చురకలు అంటించారు. 9 సంవత్సరాల్లో నగరంలో తప్ప ఎక్కడైన ఇళ్ళు కట్టారా ..? అని ఆయన ప్రశ్నించారు. మేము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళకు ఉచిత బస్ ప్రయాణం కలిపించామని ఆయన వెల్లడించారు. మేము ఇచ్చిన హమీలని నెరవేర్చడానికి మూడు వారాలనే దరఖాస్తులు తీసుకుంటున్నామని, గిరజనులని, దళితులని మోసం చేసింది బీఆర్ఎస్ అని జీవన్ రెడ్డి మండిపడ్డారు.
అంతేకాకుండా.. ‘బీఆర్ఎస్ పెట్టి తెలంగాణ పదాన్ని ఉచ్చరించే నైతిక హక్కు కెసిఆర్ కోల్పోయారు.. కేసీఆర్ సీఎం అయిన మొదటి నెలలో సీలేరు పవర్ ప్రాజెక్టు ,భద్రాద్రి ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్‌కి అప్పచెప్పారు.. కాంగ్రెస్ ప్రజలకి ఇచ్చిన హమీలని నెరవేర్చి తీరుతుంది.. తెలంగాణ హక్కులని పరిరక్షించేది కాంగ్రెస్.. కేసీఆర్ అవినితి బయటపడుతుంది అని కాళేశ్వరం ప్రాజెక్ట్ కి జాతీయ హొదా అడగలేదు.. ప్రతిపక్ష హోదాని కాపాడుకోండి.. అది తన్నుకుపోవడానికి మీ పక్కన సిద్దంగా ఉన్నారు.. జ్యుడీషియల్, సీబీఐ ఏదీ పెద్దది కిషన్ రెడ్డి.. కవితని కాపాడినట్లు కాపాడాలని చూస్తున్నారు.. మేము 15 పార్లమెంట్ స్థానాలని కైవసం చేసుకోవడం లక్ష్యంగా ముందుకి వెళుతున్నాం.. కిషన్ రెడ్డి ముందు మీ స్థానం కాపాడుకోండి.. షర్మిల చేరిక కాంగ్రెస్ కలసి వస్తుంది.. జగన్, కేసీఆర్ భేటీలో రాజకీయం ఉంటుంది.. కాంగ్రెస్ లో షర్మిల చేరిక ఎంత ప్రభావం ఉంటుందో జగన్, కేసీఆర్ చర్చించుకోవచ్చు..’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?