సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కుంగుబాటుకు కేసీఆర్ నైతిక భాద్యత వహించాలని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కొత్త ప్రభుత్వం ఏర్పడి 40 రోజులు కాలేదని, అప్పుడే ఓర్చుకోలేక పోతున్నారన్నారన్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దు అని చెప్పడానికి కేటీఆర్ ఏం హక్కు ఉందని, మేము హామీ ఇచ్చాం నెరవేరుస్తామని ఆయన వెల్లడించారు.
అదానీ ఎలా పెట్టుబడులు పెడితే.. మీకు ఏం నొప్పి అని, అదానీ అక్రమాలు ఉంటే.. మేము దూరం పెడతామన్నారు. దావోస్ లో 40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అందుకే కేటీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1.93 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని.. టీఎస్పీఎస్సీని బీఆర్ఎస్ అమ్మకంలో పెట్టిందని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చిందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చినప్పుడే ఆ పార్టీ కనుమరుగు అయ్యిందని అన్నారు. తమ ప్రభుత్వ హయంలో ఒక్క పర్యటనతో తెలంగాణకు రూ.40 వేలకోట్ల పెట్టబడులు తెచ్చామని తెలిపారు. కాంగ్రెస్‌పై విశ్వాసంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారని అన్నారు.