పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో.. ఆ జిల్లా నేతలు కొత్త నినాదం అందుకున్నారు. తాను గెలిస్తే.. ఆ పదవి ఖాయం అంటూ ప్రచారం చేస్తున్నారు. మేమే అధికారంలోకి వస్తున్నాం, ఎంపీ సీటును మాకిస్తే.. మీకో గ్యారెంటీ ఇస్తామంటున్నారు. ఇంతకీ ఏంటా గ్యారెంటీ..? నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అర్వింద్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అభ్యర్ధులుగా తలపడుతున్నారు.…
జగిత్యాల జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఒకసారి కవితకు , ఒకసారి ధర్మపురి అరవింద్ కు అవకాశం కల్పిస్తే ముత్యపేట చక్కర కర్మగారాన్ని తెరిపించలేకపోయారన్నారు. ముత్యంపేట చక్కర కర్మగారం మూతపడటంలో బీఆర్ఎస్, బిజెపి రెండు పార్టీల పాత్ర…
నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమే తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,…
జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొర బాబు భేటీ.. ఆ విషయంలో అంగీకారం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు…పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన తరవాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని దొరబాబుకు వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. పిఠాపురం నుంచి జనసేన…
జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి పదేళ్లలో ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ అని ఆయన అన్నారు. ఓటు కోసం వస్తే.. బీజేపీ నేతలను నిలదీయాలని, 15లక్షలు వస్తే బీజేపీకి , రాకపోతే కాంగ్రెస్ కు ఓటయ్యాలన్నారు. రైతు…
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమన్నారు. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు ను నిర్ణయించేది యువత… అ యువతకు ఉద్యొగు, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 2014లో సంవత్సరానికి 2…
పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రేయేట్ చేశారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన ఆర్మూరులో మాట్లాడుతూ.. ముస్లింలతో కలిసి ప్రధాని మోడీని హేళన చేసి మాట్లాదారని ఆయన మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండతోనే పిఎఫ్ఐకి జగిత్యాల అడ్డా గా మారిందని ఆయన ఆరోపించారు. హిందూ వ్యతిరేక శక్తి గా తయారయ్యారని, రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని జీవన్ రెడ్డి పోరాడటం విడ్డూరమన్నారు ఎంపీ అరవింద్. స్వాతంత్య్రం…
కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్‌కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు.
జగిత్యాల పట్టణం లో ని మార్కండేయ టెంపుల్ అవరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో కి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధమని, పదవి వచ్చిన రాకపోయినా నేను జగిత్యాల…
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కష్టాలు ఏర్పడుతున్నాయని కొన్ని మీడియా సంస్థలలో రావడాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఖండించారు. కొన్ని మీడియా సంస్థలు కావాలని విమర్శనాత్మకంగా చిత్రీకరించాయని ఆయన మండిపడ్డారు. నిన్న జగిత్యాలలో జరిగిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం గురించి రెవెన్యూ అధికారులు విద్యుత్ శాఖకు తెలుపకపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, ప్రతి రెండవ శనివారం రోజున చేపట్టే మరమ్మత్తులకై అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపి వేశారన్నారు. అధికారులు సమన్వయ లోపంతో ఏర్పడ్డ అంతరాయాన్ని…