నాపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమే
తనపై వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొట్టిపారేశారు, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు. తనను అనవసరంగా తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్‌ఎస్ నుంచి మారాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అయితే తనకు అలాంటి ఆలోచనే లేదని చెప్పారు. 2023 ఆగస్టులో తనను అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి డబ్బులు వసూలు చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధా కిషన్‌రావు, హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావులపై శరణ్‌చౌదరి సోమవారం ఫిర్యాదు చేశారు.
చీటింగ్ కేసుపై సంతోష్‌రావు రాజకీయ కుట్ర అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో దయాకర్‌రావు మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీ గల రాజకీయ నాయకుడన్నారు. ‘శరణ్ చౌదరి అనే వ్యక్తి నాపై ఆరోపణలు చేశాడు. అతను గతంలో బీజేపీతో సంబంధం కలిగి ఉన్నాడని, భూకబ్జాలు, ఇతర అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పార్టీ నుంచి తొలగించారని నాకు తెలిసింది. ఎన్నారైలను కూడా కోట్లాది రూపాయల మోసం చేశాడు. అయితే, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు” అని అన్నారు.
ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తా
జగిత్యాల పట్టణం పద్మశాలి సంఘ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంపీగా గెలిస్తే జగిత్యాల నుండి మంచిర్యాల మీదుగా ఢిల్లీకి రైల్వే లైను వేయిస్తానన్నారు. ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం.. మంచంలో పడుకొనైనా ప్రజలకు అండగా నిలుస్తానన్నారు. బలహీన వర్గాలకు కేటాయించిన హక్కులు వారికే చెందేలాగా వారి హక్కులను కాపాడానని సంతృప్తి మిగిలిందని, నా ప్రతి విజయంలో జగిత్యాల ప్రజలు వెంట ఉన్నారని, యుద్ధంలో కొట్లాడేందుకు ఓటు హక్కుతో అవకాశం ఇవ్వండి, ప్రజల తరుపున కొట్లాడుతానన్నారు. ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే మరింత మెరుగైన సేవలందిస్తానని, అవకాశం వచ్చిన ప్రతిసారి జగిత్యాల అభివృద్ధికి కృషి చేశానని ఆయన అన్నారు. జగిత్యాల పట్టణ యావర్ రోడ్ విస్తరణకు 100 కోట్లు కేటాయించాయిన విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలకు మోడీ పాలనే కారణమన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నేను ఎమ్మెల్యే గా గెలవలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జగిత్యాల ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి ఒక వారధిగా కృషి చేస్తున్నానన్నారు.
నా ఆశయం, పవన్ కల్యాణ్ ఆశయం ఒక్కటే..
టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఆయన పొన్నూరు నియోజకవర్గంలో రోడ్ షో, కార్నర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 1983లో ఒక బలమైన భావజాలంతో పుట్టిందని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే ఆశయంతో పుట్టిందని చెప్పారు. అదే విధమైనటువంటి భావజాలంతో ఈరోజు పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కల్యాణ్ ఆశయం, తన ఆశయం ఒకటేనని చెప్పారు. పవన్ కల్యాన్ కు డబ్బు మీద ప్రేమ లేదు, కీర్తి కావాలని లేదన్నారు. కేవలం ప్రజలకు న్యాయం, మంచి జరగాలన్నదే తమ ఆశయం అన్నారు.
రేపు హైదరాబాద్- ముంబై మధ్య మ్యాచ్.. భారీ బందోబస్తు
రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ ఏర్పాట్లు, బందోబస్తు పై రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ.. 2500 మంది పోలీసులతో స్టేడియం చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. స్టేడియం చుట్టూ 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్టేడియం లోపల కంట్రోల్ రూం ఏర్పాటు.. ప్రత్యేక ఐటీ సెల్ టీమ్ మానిటరింగ్ చేస్తుందన్నారు తరుణ్ జోషి. మ్యాచ్ కి మూడు రోజుల ముందే స్టేడియంను మా అదుపులోకి తీసుకున్నామని, రెండు ఆక్టోపస్ టీమ్స్ కూడా స్టేడియం వద్ద బందోబస్తు లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
పార్టీ నిర్వహణ అవసరాలకు జనసేనాని రూ.10 కోట్ల విరాళం..
పార్టీ నిర్వహణ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం మొదటి నుంచి తన స్వార్జితాన్ని పార్టీ కోసం వెచ్చిస్తూ వస్తున్న పవన్ కల్యాణ్.. ఎన్నికల సందర్భంగా పార్టీ నిర్వహణ కోసం మరోసారి భారీ విరాళాన్ని అందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నంకు విరాళం చెక్కులను అందజేశారు.
తన పారితోషికం నుంచి ఎప్పటికప్పుడు పార్టీకే కాకుండా సామాజిక సేవలకు, అధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనేందుకు విరాళం ఇస్తుంటారు. కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తలా ఓ లక్ష రూపాయలు ఇచ్చారు. ఇక పార్టీ నిర్వహణ అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయినా సొంత డబ్బులే పెట్టుకుంటూ వస్తున్నారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారని వారినే తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లుగా పవన్ కల్యాణ్ తెలిపారు.
నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కయ్యాయి
నన్ను ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కయ్యాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టండని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశమంతా మోడీ గాలి వీస్తోందని, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ మధ్యే ఎన్నికల వార్ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోడీ ప్రభుత్వమే కొనసాగాలనుకుంటున్నారని, రాష్ట్రంలో ఖజానా ఖాళీ.. జీతాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తేనే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. జాయినింగ్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టండని బీజేపీ మండల ఇంఛార్జీలకు దిశానిర్దేశం చేశారు బండి సంజయ్.
“మిస్ యూనివర్స్” ఈవెంట్‌లో తొలిసారి పాల్గొననున్న సౌదీ అరేబియా..
సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా పేరున్న ‘సౌదీ అరేబియా’ తన ఛాందసవాదాన్ని నెమ్మదిగా వదులుకుంటోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నెమ్మదిగా ఆ దేశంలో మార్పులు వస్తున్నాయి. గతంలో మహిళా హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేని ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా ఓ మహిళ దేశం తరుపున ‘‘మిస్ యూనివర్స్’’ పోటీల్లో పాల్గొనబోతోంది.
తొలిసారిగా సౌదీ అరేబియా తరుపున అధికారికంగా రూమీ అల్ఖహ్తనీ పోటీల్లో పాల్గొననున్నారు. 27 ఏళ్ల మోడల్ రూమీ ఈ విషయాన్ని సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ అందాల పోటీలో పాల్గొనే మొదటి వ్యక్తిని అని ఆమె చెప్పారు. ‘‘మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇదే తొలిసారి’’ అని పోస్టులో రాసుకొచ్చారు. సౌదీ రాజధాని రియాద్‌కి చెందిన అల్ఖహ్తానీ కొన్ని వారాల క్రితం మలేషియాలో జరిగి మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏషియన్‌లో పాల్గొన్న చరిత్ర ఉంది.
అరెస్ట్‌పై కేజ్రీవాల్ పిటిషన్.. విచారణ ఎప్పుడంటే..!
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. అరెస్ట్, కస్టడీపై అత్యవసరంగా విచారించాలని గత శనివారం ఆయన.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆదివారంలోపు విచారించాలని ఆయన కోరారు. అయితే ఎమర్జెన్సీ విచారణకు న్యాయస్థానం నిరాకరించింది. ఆదివారం సెలవు కావడం.. అటు తర్వాత సోమ, మంగళవారాలు.. రెండు రోజులు ధర్మాసనానికి హోలీ సెలవులు వచ్చాయి. దీంతో బుధవారం విచారిస్తామని తెలిపింది. ఉదయం 10:30 గంటలకు జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ వ్యాజ్యాన్ని విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అధికారులు.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా ఈనెల 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇక జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగిస్తారని ఆప్ మంత్రులు వెల్లడించారు. ఇప్పటికే కేజ్రీవాల్ రెండు ఆదేశాలు జారీ చేశారు. ఇక కేజ్రీవాల్ పంపించిన సందేశాన్ని.. ఆయన సతీమణి సునీతా చదివి వినిపించారు.
పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై స్పందించిన సంజయ్ కుమార్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో మాట్లాడుతూ.. నేను పార్టీ మారను. ఏ పార్టీలోకి వెళ్ళనని ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీ మారతాడని పలు పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. రాజకీయం నా వృత్తి, వైద్యం నా ప్రవృత్తి అని ఆయన తెలిపారు. వాళ్లు వీళ్లు పార్టీలు మారుతున్నట్టు నేను మారనని, మూడుసార్లు ఎమ్మెల్యేగా పార్టీ అవకాశం ఇచ్చింది… ప్రజలు గెలిపించారన్నారు. ఎప్పుడు కార్యకర్తలు, ప్రజల వేనంటే ఉంటానని ఆయన అన్నారు.
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ.. యవతతో సమావేశంలో చంద్రబాబు
కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా.. యువతతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా యువత అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పారు. ఏ రంగంలో కూడా అడ్డదారిలో విజయాలు రావు.. లక్ష్య సాధనకు అనునిత్యం కృషి చేయాలని పేర్కొన్నారు. ద్రవిడ విశ్యవిద్యాలయంలో తొలగించిన కోర్సులను పునరుద్దరిస్తాం.. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. మద్యానికి బానిసలైన వారిని విముక్తి చేయడానికి మండలానికో సైకాలజిస్ట్ ను నియమిస్తామని చంద్రబాబు అన్నారు.
రాధికకు ఎన్ని కోట్ల ఆస్తులున్నాయంటే..!
తమిళనాడులో తొలి విడతలోనే లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈసారి ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి నుంచి బలమైన అభ్యర్థులను పార్టీలు బరిలోకి దించాయి. ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ సాగుతోంది. అయితే విరుదునగర్ నుంచి గట్టి పోటీనే నెలకొంది. ఇక్కడ సినీ నటి రాధికా శరత్‌కుమార్, దివంగత నటుడు కెప్టెన్, విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ తలపడుతున్నారు. ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అఫిడవిట్‌లో రాధికా శరత్‌కుమార్ మొత్తం రూ.53.45 కోట్ల సంపద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక విజయ ప్రభాకరన్ రూ.17.95 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
రాధిక సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తన దగ్గర రూ. 33.01 లక్షల నగదు, 750 గ్రాముల బంగారం, 5 కిలోల వెండి ఆభరణాలు సహా రూ.27,05,34,014 విలువ చేసే చరాస్తులు ఉన్నాయని.. అలాగే రూ.26.40కోట్ల స్థిరాస్తులతో పాటు రూ.14.79కోట్ల అప్పులు ఉన్నాయని ఆమె అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.
“మతం పేరుతో ప్రచారం”.. కేరళ సీఎంపై ఈసీకి బీజేపీ లేఖ..
కేరళ సీఎం పినరయి విజయన్ మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని కేరళ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సీఎం ముస్లిం వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఉదహరించింది. సీఎం ‘‘మతం పేరుతో ప్రచారం’’ చేస్తున్నారని ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆయన ప్రచారాన్ని నిషేధించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
సోమవారం సీపీఎం మలప్పురంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించింది. దీనికి సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడటంపై బీజేపీ నేత కేకే సురేంద్రన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా, అల్లర్లను రెచ్చగొట్టేలా, రాజకీయంగా మైలేజ్ పొందేలా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని లేఖలో ఆరోపించారు. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ముస్లిం సమాజంలో భయాందోళనలు విద్వేషాలు నింపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేశారని ఆయన ఆరోపించారు.