జగిత్యాల జిల్లా నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ మెట్‌పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో నిజామాబాద్ ఎంపీగా ఒకసారి కవితకు , ఒకసారి ధర్మపురి అరవింద్ కు అవకాశం కల్పిస్తే ముత్యపేట చక్కర కర్మగారాన్ని తెరిపించలేకపోయారన్నారు. ముత్యంపేట చక్కర కర్మగారం మూతపడటంలో బీఆర్ఎస్, బిజెపి రెండు పార్టీల పాత్ర ఉందన్నారు. 2014 – 18 మధ్యకాలంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది.కానీ చక్కెర కర్మాగారం పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ చక్కర కర్మాగారాన్ని తెరిపించే ప్రయత్నంలో ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే సంక్షేమ పథకాలు నిర్వీర్యం అవుతాయని ప్రతిపక్షల ఆరోపిస్తున్నాయన్నారు. భారతదేశం అంబానీ,ఆధాని చేతుల్లో కీలుబొమ్మగా మారిందన్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రభుత్వ సంస్థలన్నీ అమివేస్తున్నాడని, మోడీ ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇంతవరకు వేయలేదన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా సరిగా పరిపాలన చేస్తే ఈరోజు రైతులకు నీటి కొరత ఉండేది కాదు. ఎస్సారెస్పీలో 10 టీఎంసీల నీళ్లు ఇప్పటివరకు ఆధనoగా ఉండేవని, ఈరోజు అలా నీళ్లు లేవంటే కేసీఆర్ నైతిక బాధ్యత వహించేయాల్సిందేనన్నారు. కేసీఆర్ తెలంగాణలో తిరుగుతే స్వాగతిస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో కనుమరుగైపోతుందన్నారు.