జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రధానమన్నారు. రుణగ్రస్తుడైన రైతును రుణ విముక్తుడిని చేయడానికి యూపీఏ ప్రభుత్వం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు ను నిర్ణయించేది యువత… అ యువతకు ఉద్యొగు, ఉపాధి కల్పన ప్రభుత్వాల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 2014లో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నాడు మోడీ అని, 10 ఏళ్ళు గడిచిన ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేకపోయాడని జీవన్ రెడ్డి విమర్శించారు. పబ్లిక్ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టారు, ప్రభుత్వం ఒక్క వ్యాపార సంస్థ ఐపోయిందని ఆయన మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులవుతారు అంటున్నారు, అంబానీ ఆదానిలకు లక్షల కోట్లు మాఫీ చేస్తే సోమరిపోతుల కారా అని ఆయన అన్నారు. రాబోయేది కాంగ్రెస్ డబుల్ ఇంజన్ సర్కారే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
KL Rahul-IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు.. కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు!
నాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం చేసినపుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? రాష్ట్రంలో ఉన్నది మీ మిత్ర పక్షం టీడీపీ కాదా? అని ప్రశ్నించారు. పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆ బోర్డు విధివిధానాలు ఏంటి? బోర్డులో ఉన్న పాలక వర్గం ఎవరు? వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా పసుపు బోర్డు తెచ్చి పసుపుకు ముప్పై వేల ధర ఇస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
Viral: పెళ్లిచూపుల్లో ఖాకీ డ్రెస్ లో కనపడ్డ యువతి.. అనుమానంవచ్చి విచారించగా..?