జగిత్యాల పట్టణం లో ని మార్కండేయ టెంపుల్ అవరణలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ నుండి మున్సిపల్ చైర్మన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ లో కి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఉంటే కేసీఆర్ తెలంగాణ ను ఆంధ్రప్రదేశ్ కు తాకట్టు పెట్టావాడని విమర్శించారు. కృష్ణ నది జలాల కేటాయింపు కోసం ఆంధ్ర తో యుద్దానికైనా సిద్ధమని, పదవి వచ్చిన రాకపోయినా నేను జగిత్యాల అభివృద్ధి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగలు భర్తీ చేసామని, 5 సంవత్సరా ల కాలంలో ఆరు లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామన్నారు జీవన్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు లకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. 2004 కి ముందు సిరిసిల్ల, సిద్ధిపేటతో జగిత్యాల లో జరిగిన అభివృధి పై హరీష్,KTR లు చర్చ కు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. 100 కోట్ల నిధుల తో జగిత్యాల యావర్ రోడ్డు వెడల్పు చేస్తానని జీవన్ రెడ్డి అన్నారు.
Aishwarya Addala: సీరియల్ నటి ఐశ్వర్య అక్రమ సంబంధం.. వీడియోలు, ఆడియోలు వైరల్
అంతేకాకుండా.. ‘ కాళేశ్వరం ప్రాజెక్ట్ తో దేశంలో తెలంగాణ పరువు పోయింది. సమాచారా హక్కు కు చట్టభద్దత కల్పించిది కాంగ్రెస్ పార్టీ. సమాచార హక్కు ను నిర్వీర్యం చేసింది బీజేపీ పార్టీ. బీజేపీ అధికారం లో కి వస్తే రాజ్యంగాన్ని మర్చి రిజర్వేషన్ ల ను రద్దు చేసే కుట్ర జరుగుతుంది. జాతీయస్థాయి లో మహిళాల కు రైళ్లల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి. బీజేపీ అవినీతి నిర్ములన మాటలు ఆచరణలో లో నే కార్యరూపందల్చడం లేదు. మున్సిపల్, పంచాయతీ రాజ్ చట్టాలలో మార్పులు చేసి బలహీన వర్గాల కు అవకాశం కల్పించం. మున్సిపల్ చైర్మన్ ఆడువాలా జ్యోతి ని కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానిస్తున్నాం. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. జగిత్యాల జిల్లా ను రాష్ట్రము లో ఆదర్శవంతమైన జిల్లా తీర్చిదిద్దడం నా బాధ్యత. జగిత్యాల లో JNTU, వ్యవసాయ కళాశాల, NAC సెంటర్ ను ఏర్పాటు చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధన లో కొండలక్ష్మణ్ బాపుజి ది ప్రత్యేక స్థానం. దశబ్ద కాలంగా కెసిఆర్ కు ప్రజలు అవకాశం కల్పించారు. కేసీఆర్ ప్రజలను దశబ్దకాలంగా మోసం చేశారు, ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చలేక పోయారు. నీటి కేటాయింపు లో తెలంగాణకు అన్యాయం జరిగింది. 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగలు ఏమయ్యాయి మోడీ’ అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం