Vijayashanti : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, , విజయశాంతి పేర్లు ఖరారు చేయబడ్డాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని తీసుకుని, అధికారికంగా టికెట్లు అందజేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించబడిన తర్వాత, ఈ విషయంపై విజయశాంతి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి తనకు కేటాయించారా లేదా అనే అంశం తనకు తెలియదని, కాంగ్రెస్ అధిష్ఠానం ఏ ఆలోచనలో ఉందో తనకు…
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈనెల 10న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లారు. సీఎంతో పాటు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్, మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను...ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.
CM YS Jagan: త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభ్యర్థులను ప్రకటించింది.. 18 మంది పేర్లను ఖరారు చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇక, ఆ తర్వాత క్యాంప్ కార్యాలయానికి వెళ్లి వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు కొందరు ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ముఖ్యమంత్రి జగన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.. తనను కలిసిన అభ్యర్థులతో కాసేపు మాట్లాడిన సీఎం జగన్.. కీలక సూచనలు…
పదవుల పందేరంలో వారికి మరోసారి రెన్యువల్ దక్కలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రాజకీయంగా గ్రహణం పట్టిందా.. లేక భవిష్యత్‌లో ఇంకేదైనా పదవీయోగం ఉంటుందా? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి..? పదవి గ్యారెంటీ అనుకున్నారు. కానీ.. కొందరు మాజీగానే మిగిలిపోతే.. ఇంకొందరు జనవరిలో మాజీలు కాబోతున్నారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి? రెన్యువల్ ఖాయమని భావించిన వారి ఆశలు ఎక్కడ తేడా కొట్టాయి? అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ప్రస్తుతం…
ఆ ఇద్దరు అనూహ్యంగా ట్రాక్ మీదకు వచ్చారు. వస్తూ వస్తూనే పదవి ఎగరేసుకుని పోయారు. ఈసారి తమకు ప్లేస్‌మెంట్ ఖాయం అనుకున్న నేతలు నోరెళ్లబెట్టారు. లెక్కలు మనం వేసుకుంటే ఫలితం రాదు.. నాయకుడు వేస్తేనే వస్తాయని సైలెంట్ అయ్యారట. రెండు పేర్లు చివరి నిమిషంలో రేస్‌లోకి వచ్చాయా? ఆంధ్రప్రదేశ్‌లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్ధుల ఎంపికపై వైసీపీ హైకమాండ్ కొద్దిరోజులుగా కసరత్తు చేసింది. సామాజికవర్గాల ఈక్వేషన్స్‌లో 50-50 శాతం రేషియో పాటిస్తున్న సీఎం జగన్…
ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలపై టీఆర్ఎస్ కసరత్తు ఎంత వరకు వచ్చింది? పదవీకాలం ముగిసిన వారిలో ఓసీ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ. కొత్తగా సీటు ఆశిస్తున్నవాళ్లు.. రెన్యువల్ కోరుతున్న వారిలోనూ OC నేతలే అధికంగా ఉన్నారు. మరి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక లెక్కల సమతూకం ఎలా? ఈ అంశంపై గులాబీ శిబిరం తేల్చుకోలేకపోతోందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సామాజిక సమీకరణాలు ఎలా? అధికార టీఆర్‌ఎస్‌లో పదవుల పండగ మొదలైంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన…