Vasantha Krishna Prasad: కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై అనేక ప్రచారాలు జరుగుతూ వచ్చాయి.. ఆయనకు, మంత్రి జోగి రమేష్ మధ్య వివాదాలతో.. ఎమ్మెల్యే వసంత వైసీపీకి గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.. అయితే, మైలవరం పంచాయతీ విషయంలో రంగంలోకి దిగిన సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చర్చలు జరిపారు.. ఈ చర్చలు సఫలం అయినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అన్నింటిపై క్లారిటీ ఇచ్చారు.. ఇటీవల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించలేదు.. సీఎం వైఎస్ జగన్ పిలిచి మాట్లాడారు ఇకపై నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.. నాపై పార్టీ మారుతున్నాని ప్రచారాలు జరుగుతున్నాయి.. కానీ, నేను వైఎస్ఆర్ అభిమానిని నేను ఎప్పటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు.
Read Also: Turkey Earthquake: కన్నీరు పెళ్లిస్తున్న ఓ తండ్రి ఫోటో..తీవ్ర భావోద్వేగానికి గురైన ఫోటోగ్రాఫర్
ఇక, పార్టీ అంతర్గత సమావేశంలో విభేదాలపై చర్చించామని తెలిపారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్.. గత ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం కోట్ల రుపాయలు వెచ్చించి సంక్షేమ పథకాలు చేస్తోందన్న ఆయన.. దేశంలో పెద్ద నాయకురాలు సోనియాతో విభేదాలు పెట్టుకుని పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన నేత వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు. లోకేష్ దొడ్డి దారిలో పదవులు అనుభవించి పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. నాడు వైఎస్, జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో జనసముద్రం లాగా పాల్గొన్నారు.. యువకుడు రాహుల్ 160 రోజులలో పాదయాత్ర చేస్తే లోకేష్ 400 రోజులు చేయడం ఆ పార్టీకే నష్టం అన్నారుడు కృష్ణప్రసాద్.
Read Also: Priyanka Jawalkar: అనంతపురం పిల్ల ఎంత చూపించినా.. సెట్ అవ్వడం లేదే
మరోవైపు, నా నియోజకవర్గంలో నా సొంత పార్టీ వారే ఇబ్బందులు పెట్టడం నిజం అన్నారు వసంత కృష్ణప్రసాద్.. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఒకరి నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకోరాదని స్పష్టం చేశారని తెలిపారు.. ఎట్టిపరిస్థితుల్లో నేను పార్టీ వీడను.. ఎప్పటికి వైఎస్ కుటుంబంతోనే నా ప్రయాణం అని స్పష్టం చేశారు.. ఇక, దేవినేని ఉమా 379 కోట్ల ఇరిగేషన్ పనులు ఇస్తానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి దగ్గర 20 కోట్ల రూపాయాలు తీసుకున్నాడు.. కొండపల్లికి చెందిన వ్యక్తి దగ్గర 5 కోట్లు తీసుకున్నాడు.. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.. వచ్చే ఎన్నికల్లో దేవినేని ఉమకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తారని అనుకోవడం లేదనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఇకపై నియోజకవర్గంలో ప్రతి కదలికపై సీఎం వైఎస్ జగన్ పర్యవేక్షిస్తారు.. మితిమీరితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారని తెలిపారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.