KTR : తెలంగాణ సర్కార్ అభివృద్ధే ప్రధానంగా దూసుకుపోతుంది. దీంతో అంతర్జాతీయ కంపెనీలు విశ్వనగరం హైదరాబాదులో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పై విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 5 వ స్నాతకోత్సవంలో మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన హామీల అమలు పై ట్రిపుల్ ఐటీ అధికారులను ప్రశ్నించారు మంత్రి.
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరగనుంది. చాలా మంది అభ్యర్థుల ఎప్పటి నుంచో టెట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ వచ్చే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు ఎన్సీఈఆర్టీ సెక్రటరీ రాధారెడ్డి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పని సరిగా ఓఎంఆర్ షీట్ లోని గడులను నింపడానికి తప్పకుండా నల్ల ఇంక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలని రాధారెడ్డి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విడుదల…