తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరగనుంది. చాలా మంది అభ్యర్థుల ఎప్పటి నుంచో టెట్ కోసం రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్ వచ్చే అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు ఎన్సీఈఆర్టీ సెక్రటరీ రాధారెడ్డి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పని సరిగా ఓఎంఆర్ షీట్ లోని గడులను నింపడానికి తప్పకుండా నల్ల ఇంక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలని రాధారెడ్డి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి హాట్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. టెట్ పరీక్ష అనంతరం ఈ నెల 27న ఫలితాలు విడుదల కానున్నాయి.
అయితే ఇదే రోజు ఆర్ఆర్బీ ఎగ్జామ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థలు పరీక్షా తేదీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇతర పరీక్షల షెడ్యూల్స్ ఇప్పటికే సిద్ధం అయి ఉండటంతో పరీక్ష వాయిదా వేయడం కుదరదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో ఈనెల 30 నుంచి కామన్ ఎంట్రన్స్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. వీటికి సంబంధిచి డేట్లు ఈ విధంగా ఉన్నాయి. ఈనెల 30న పాలీసెట్, జూలై 13న ఈసెట్, జూలై 14-20 వరకు ఎంసెట్, జూలై 21, 22 తేదీల్లో లాసెట్, పీజీ లాసెట్, జూలై 26, 27 తేదీల్లో ఎడ్‌సెట్, జూలై 27, 28 తేదీల్లో ఐసెట్, 29న పీజీ ఈ-సెట్, ఆగస్టు 22న పీఈసెట్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి.