Minister Sabitha reaction on question paper leak: పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పై విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నాలుగు లక్షల 95 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతగా పనిచేద్దామని తెలియజేసుకుంటున్నానని అన్నారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని మనవి చేసుకుంటున్నానని సోషల్ మీడియా ద్వారా సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ వాట్సాప్‌లో ప్రశ్నపత్రాలు రావడం సంచలనంగా మారింది. నిన్న వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని చిత్రీకరించి మరో వ్యక్తికి వాట్సాప్‌లో పంపాడు. ఈరోజు వరంగల్‌లో హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రశ్నపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమైన ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. బయటకు వచ్చిన పేపర్ ఈరోజు కన్ఫర్మ్ అవుతుందని చెప్పారు. కానీ పేపర్ సీరియల్ నంబర్ కనిపించకుండా ఫొటో తీశారని తెలిపారు. ఆ పేపర్ ఎక్కడి నుంచి బయటపడిందో విచారణలో తెలుస్తుందన్నారు. అయితే ఇది లీకేజీ కాదని, పేపర్ బయటికి వచ్చిందన్నారు. సగం పరీక్ష ముగిశాక పేపర్ బయటకు వచ్చిందన్నారు.
Telangana Congress: కోమటిరెడ్డి పై హైకోర్టుకు చెరుకు సుధాకర్.. నేడే విచారణ