Minister Roja: జబర్దస్త్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ షో తరువాత రోజా ఎంతో ఫేమస్ అయ్యింది. ఒకానొక దశలో జబర్దస్త్ లేకపోతే తన జీవితం ఏమైపోయేదో అని కంటతడి పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఇక మంత్రిగా పదవీ స్వీకారం చేశాక జబర్దస్త్ స్టేజిని వదిలింది రోజా.. ఆమె లేని లోటును ప్రస్తుతం మరో సీనియర్ నటి ఇంద్రజ తీరుస్తోంది. ఇక జబర్దస్త్ ను వీడినరోజునే పండగలప్పుడు, స్పెషల్ ఈవెంట్స్ కు గెస్టుగా వస్తానని చెప్పిన రోజా చెప్పినట్టుగానే దసరా స్పెషల్ ఈవెంట్ గా చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి గెస్టుగా వచ్చింది. ఇక చాలా రోజుల తరువాత కమెడియన్స్ అందరూ రోజా రాకతో సంతషం వ్యక్తం చేశారు. రావడం రావడమే ఆది, రామ్ ప్రసాద్ లపై పంచ్ లు వేసి మెప్పించిన రోజా షో మొత్తాన్ని ఎంజాయ్ చేసింది. ఇక చివర్లో రోజాకు సన్మానం చేస్తున్న సమయంలో ఆమెను ఆది అవమానించినట్లు చూపించారు.
నూకరాజు అడగకూడని ఒక ప్రశ్న అడగడంతో రోజా హార్ట్ అయ్యినట్లు కనిపిస్తోంది. ఇక ఆది కూడా దానికి వంత పాడడంతో కంటతడి పెట్టుకున్న రోజా.. అవమానించడానికే పిలిచారా.. ప్లాన్ చేసుకొని అవమానిస్తారా..? అంటూ స్టేజి దిగివెళ్లిపోవడంతో ప్రోమో ఎండ్ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ప్రోమో చూసిన వారందరు రేటింగ్స్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్నాళ్లు ప్లే చేస్తారు అని కొందరు.. రోజా మళ్లీ ఇలాంటి షోలకు వచ్చి మంత్రి పదవికి ఉన్న పరువు తీయకు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు రోజాను ఎవరు..? ఎందుకు ..? అవమానించారు అనేది చూడాలంటే దసరా రోజున ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.