Minister Roja: టాలీవుడ్ సీనియర్ నటి, మంత్రి రోజా నేడు తన 50 వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు. ఇక తన పుట్టినరోజునా స్వామివారి ఆశీస్సులు అందుకోవడానికి తిరుపతి వెళ్లిన ఆమె స్వామివారి దర్శనానంతరం మీడియాతో ముచ్చటించారు.
Minister Roja: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామిని ఏపీ టూరిజంశాఖ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్శంగా స్వామి, అమ్మవార్లకు రోజా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఒక రౌడీ మాదిరిగా కారు మీద కూర్చుని ఇప్పటం వెళ్లాడని…
Andhra Pradesh: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వర్గపోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజవర్గంలో ఇటీవల వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో నగరి నియోజకవర్గ అసమ్మతి వ్యవహారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలపై సీఎం జగన్‌కు మంత్రి రోజా ఫిర్యాదు చేశారు. చక్రపాణిరెడ్డి వర్గం నియోజకవర్గంలో తనను బలహీనపరుస్తోందని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే మంత్రి…
Minister Roja: వైసీపీలో ఫైర్‌బ్రాండ్లు ఎవరంటే అందరూ టక్కున మంత్రి రోజా, మాజీ మంత్రి కొడాలి నాని పేర్లు చెప్తారు. వీళ్లిద్దరూ ప్రెస్‌మీట్‌కు వచ్చి మాట్లాడితే ప్రతిపక్షాలకు పంచ్‌లు పడాల్సిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మాజీ మంత్రి కొడాలి నాని పుట్టినరోజు కావడంతో మంత్రి రోజా స్పెషల్‌గా విషెస్ తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే కొడాలి నాని అన్నయ్యా’ అంటూ సోషల్ మీడియాలో మంత్రి రోజా పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. ‘నీ అంత…
Roja Selvamani: తెలుగుదేశం పార్టీపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తనదైన శైలిలో ఫైరయ్యారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ దుశ్శాసనుల పార్టీగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే అత్యాచారాలు, అరాచకాలకు పాల్పడుతున్నారని మంత్రి రోజా ఆరోపించారు. యువతులు, మహిళలపై టీడీపీ నేతలు చేసే అరాచకాలపై చంద్రబాబు, లోకేష్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నేత వేధింపుల వల్లే ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని మంత్రి రోజా ఆగ్రహం…
Navaratri 2022: ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనానికి 5 గంటలకు పైగా సమయం పడుతోంది. విజయదశమి కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అయితే భవానీలు…