అనగనగా..ఓ మంత్రి. తొలిసారి మంత్రిగా పదవీయోగం దక్కింది. ఆ సంతోషంలోనే ఓ కారు కొనుగోలు చేశారు. కానీ…ఆ ఆనందం మాత్రం ఎంతోసేపు నిలవలేదు. కారు ఎక్కడి నుంచి వచ్చిందంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు విపక్ష నేతలు. ఐతే..మంత్రిగా కౌంటర్ ఇవ్వాల్సింది పోయి..సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత హైకమాండ్‌కు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇంతకీ…ఎవరా మంత్రి? ఆ కారు కహానీ ఏంటి?
నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే రోజా నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐతే..ఆమెపై సొంత పార్టీ నేతలతోనే పేచీ అలవాటుగా మారిందనే విమర్శలు సైతం ఉన్నాయి. బయట నుంచి వచ్చే విమర్శలు…వివాదాలు రోజాకు కొత్త ఏమీ కాదట. ఇటీవల మంత్రి రోజా మరో వివాదంలో చిక్కుకున్నారు. పదవి చేపట్టిన తరువాత దూకుడు మీదున్నారట రోజా. అదే దూకుడును ప్లీనరీలో చూపించి అధినేత జగన్ దగ్గర, ఇటు కేడర్‌లోనూ మంచి మార్కులే కొట్టేశారని టాక్.
అదే ఊపులో ముచ్చట పడి ఓ కారు కొనేశారు. కొడుకుతో కలిసి ఫొటోలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పెట్టారు. అది కాస్తా ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారింది. దీంతో రోజా తెగ ఇబ్బంది పడుతున్నారని టాక్. కారు కొన్నది రోజా కావడం…అది కూడా బెంజ్ కావడంతో పొలిటికల్ సర్కిల్స్ తీవ్ర చర్చగా మారింది. కారు వెనుకున్న రహస్యం ఏంటి అంటూ సోషల్ మీడియాలోను రోజాను ఓ ఆట ఆడేసుకుంటున్నారట జనసేన, టిడిపి నేతలు. బయట ఇంత రచ్చ కావడంతో కారు విషయంపై సొంత పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట. ముఖ్యంగా జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు…నగరిలో రోజా వ్యతిరేక వర్గం ఆ బెంజ్ కారు గురించి గట్టిగానే ఆరా తీశారని వినికిడి. దీంతో ఎవరికి తోచినట్లుగా వారు ప్రచారం చేశారు. ప్రతిపక్షాలతో పాటు సొంత నియోజకవర్గంలోని వ్యతిరేకవర్గం సైతం ఆరా తీయడంతో రోజా అనుచరుల్లో కలవరం మొదలైందట. మంత్రిగా బాధ్యత స్వీకరించిన కొన్ని నెలలకే కొత్త కారు కొనడం వివాదంగా మారిందని అనుకుంటున్నారట. అమె అనుచరులు మాత్రం దాని వెనుకున్న రహస్యం ఏమీ లేదని మాట్లాడుకుంటున్నారని టాక్.
బెంజ్ కారు రహస్యం రుషి కొండకే తెలుసు.సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శలు రోజా…ఎందుకు స్పందించట్లేదని తెగ చర్చలు.
పెద్దిరెడ్డిని కలిసి క్లారిటీ ఇచ్చిన మంత్రి రోజా టిడిపి, జనసేన మాత్రం బెంజ్ కారు రహస్యం రుషి కొండకు మాత్రమే తెలుసంటూ సామాజిక మాధ్యమాల వేదికగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి. జిఎస్టీ లేకుండా…అనుమతులు లేకుండా పనులు చేసుకోవడానికి వచ్చిన బహుమతి అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ స్థాయిలో విమర్శలు వస్తున్నా…నోరు మెదపకుండానే ఉండిపోయారు రోజా. ఎప్పుడూ మాటల తూటలు పేల్చే రోజా…ఎందుకు స్పందించట్లేదని తెగ చర్చించుకుంటున్నారట విపక్ష నేతలు. ఇదికాస్తా..కారు వెనుకున్న రహస్యం ఏంటనే చర్చలకు మరింత బలం చేకూర్చిందట. కొత్త కారు కొన్న ఆనందం క్షణం కూడా ప్రతిపక్ష పార్టీ ఉండనివ్వలేదంటూ గుర్రుగా ఉన్నారట రోజా. విపక్ష నేతల విమర్శలకు బహిరంగంగా సమాధానం చెప్పకుండా ఉన్న రోజా…మంత్రి పెద్దిరెడ్డిని కలిసిన సమయంలో మాత్రం తొలిసారిగా దానిపై క్లారీటి ఇచ్చే ప్రయత్నం చేశారని టాక్. చిన్నచిన్న నటీనటులు కారు కొంటున్నారని తాను కొనడం గొప్పా?దానికి రుషికొండకు లింక్ చేయడం ఏంటని ఫైర్ అయ్యారట రోజా.
ఇన్ని రోజులు మౌనం ఎందుకు రోజమ్మా?పవన్ కల్యాణ్ ఎనిమిది కార్లు కొనడం తప్పా?బెంజ్ కారుతో రోజాకు మళ్లీ చికాకులు అలా రోజా క్లారిటీ ఇచ్చారో లేదో..ఇలా మళ్లీ టిడిపి, జనసేన సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకున్నారట. ఇన్ని రోజులు మౌనం ఎందుకు రోజమ్మా..అని టిడిపి అంటే…చిన్నచిన్న నటీనటులు, రోజానే కార్లు కొంటే సినిమాకు యాబై కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పవన్ కల్యాణ్ రెండు కోట్లు పెట్టి ఎనిమిది కార్లు కొనడం తప్పుగా కనిపించిందా? అంటూ సెటైర్లతో పోస్టులు పెడుతున్నారట. ఇలా ఆ బెంజ్ కారు కహానీ రోజాకు మళ్లీ చికాకు తెప్పించిందని టాక్. కారుపై రోజా వివరణ ఇచ్చి తప్పు చేశారంటూ అనుచరులు తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి ముచ్చటగా కొన్న బెంజ్ కారు చుట్టూ వచ్చిన విమర్శలు ప్రశాతంత లేకుండా చేసిందని తెగ మథనపడుతున్నారట మంత్రి రోజా.