ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఆథారిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ డ్రైవ్ నిర్వహించారు.. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు మంత్రి.. భవనాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం అన్నారు..
టీడీఆర్ బాండ్లపై కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారాయణ.. మున్సిపల్ కమిషనర్లు, యూడీఏల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఈ రాత్రిలోగా వెరిఫికేషన్ పూర్తయి పెండింగ్‌లో ఉన్న అన్నిబాండ్లను లబ్ధిదారులకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.. ఆన్‌లైన్‌లో బాండ్లను జారీ చేయాలని ఆదేశించారు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా వచ్చిన టీడీఆర్ దరఖాస్తులను రెండు రోజుల్లోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు..
Minister Narayana : నరేడ్కో (నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్)సెంట్రల్ జోన్ డైరీ 2025 ను మంత్రి నారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మేల్యేలు బోండా ఉమా, యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ ను ఘనంగా NAREDCO సభ్యులు సత్కరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు అని అన్నారు. మూడు ముక్కలాటతో అమరావతినీ…
ఐదు అంతస్థుల వరకు ఎటువంటి అనుమతులు అవసరం లేదన్నారు మంత్రి నారాయణ.. ఆన్‌లైన్‌లో అప్లై చేసి నిర్మాణాలు చేసుకోవచ్చని సూచించారు.. లేఔట్, భవనాల నిర్మాణం కోసం మునిసిపాలిటీకి డబ్బు చెల్లిస్తే అన్ని అనుమతులు మంజూరు చేస్తుంది.. వేరే శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు..
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం రానున్న మూడేళ్లలో పూర్తి చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ.. ఇప్పటికే అనుమతి లభించిన 45 వేల కోట్ల రూపాయల నిర్మాణాలకి రేపు కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపి.. టెండర్లు పిలవబోతున్నామని తెలిపారు. అమరావతి మొత్తం ప్రాజెక్టు వ్యయం 62 వేల కోట్ల రూపాయలు అని వెల్లడించారు. రాజమండ్రిలో పర్యటనలో మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. వచ్చే ఏడాది జులైలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ…
నగర పాలక సంస్థ, ఇండియన్ ఆయిల్ కంపెనీ సౌజన్యంతో ఏర్పాటు చేసి నిర్వహించనున్న ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు) ఇతర కార్పొరేషన్లకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి డా.పి.నారాయణ అన్నారు. ఈరోజు స్థానిక క్వారీ సెంటర్ రైతు బజారు ప్రక్కన కోటి 95 లక్షల 85 వేల రూపాయలతో నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ (పెట్రోల్ బంకు)ను మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి,…
అమరావతిలో లే ఔట్లు, ట్రంక్ రోడ్లు, హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్లు, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అథారిటి అనుమతిచ్చింది అని తెలిపారు మంత్రి నారాయణ.. ఇవాళ 24,276.83 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు అనుమతులిచ్చింది.. మొత్తం ఖర్చు 62 వేల కోట్లు ఖర్చు అంచనాలో ఇప్పటి వరకూ 45,249.24 కోట్లకు అనుమతులు లభించినట్టు వెల్లడించారు..
రాజధాని అమరావతితో హైవేల కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. అందులో భాంగా రోడ్లను పరిశీలించారు మంత్రి నారాయణ.. అమరావతితో హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్లను పరిశీలించిన ఆయన.. పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.. హైవే నుంచి అమరావతికి మధ్యలో ఫారెస్ట్ ల్యాండ్ అనుమతులపై మంత్రికి వివరించారు అధికారులు.
గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసునని.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని మంత్రి నారాయణ విమర్శించారు. గుంటూరు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు.