Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టింది.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటర్ ఆథారిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ డ్రైవ్ నిర్వహించారు.. ప్రతి దరఖాస్తుకు సంబంధించి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు పెండింగ్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అధికారులను వివరణ అడిగారు మంత్రి.. భవనాలు, ప్లాట్లు కొనుగోలుచేసేవారు ప్రకటనలు చూసి మోసపోకుండా ఉండేలా చూడటమే రెరా లక్ష్యం అన్నారు.. కేంద్ర చట్టం ప్రకారం రాష్ట్రంలో 2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చింది.. అప్పటి నుంచి కేంద్రం ఇచ్చిన నిబంధనలు రాష్ట్రంలో తూ,చ. తప్పకుండా అమలుచేసేలా ముందుకెళ్తున్నామన్నారు.
Read Also: HMPV Virus: లాక్‌డౌన్ అంటూ వదంతులు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
రెరాలో ఇప్పటివరకూ 167 దరఖాస్తులు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయి.. కొన్ని దరఖాస్తులు పరిష్కారం కావడం లేదని ఫిర్యాదులు వచ్చాయి.. దీంతో ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం అన్నారు మంత్రి నారాయణ.. రాష్ట్రం నలుమూలల నుంచి 30 మంది క్లయింట్లు, బిల్డర్లు, డెవలపర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చారు.. ఆయా దరఖాస్తులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశాం.. పెండింగ్ అప్లికేషన్లు అన్నీ ఈ నెలాఖరులోగా క్లియర్ చేస్తాం. ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలను కూడా కొన్ని పరిశీలీంచాం.. అయితే రెరా నిబంధనలు మరింత సరళతరం చేసేలా కమిటీ వేసి ముందుకెళ్తామన్నారు మంత్రి నారాయణ.. రెరా అనుమతులు ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ లో జరిగేలా త్వరలో మార్పులు చేస్తున్నామన్నారు. 167 దరఖాస్తు లు పెండింగ్‌లో ఉండగా ఈనెలాఖరుకు పరిష్కరించాలని ఆదేశించాం.. గత ప్రభుత్వంలో బిల్డర్లు, డెవలపర్లుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరగాలనేది సీఎం చంద్దరబాబు లక్ష్యమని.. అందుకు అనుగుణంగా భవన, లేఅవుట్ల అనుమతులను సరళతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
Read Also: MP Vijaysai Reddy: ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ.. 25 ప్రశ్నలు సంధించిన ఈడీ..
ఇక, ఈనెలాఖరులోగా పెండింగ్ టీడీఆర్ బాండ్లు అన్నీ జారీ చేస్తాం అన్నారు మంత్రి నారాయణ.. తణుకు, తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలు జరగడంతో వాటితో పాటు కొన్నాళ్లపాటు అన్నిచోట్లా బాండ్ల జారీ నిలిపివేసామన్నారు.. తాజాగా ఒకట్రెండు చోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా పెండింగ్ లో ఉన్న టీడీఆర్ బాండ్లను జారీ చేస్తున్నామన్నారు.. గత మూడు రోజులుగా ప్రతి రోజూ అన్ని మున్సిపాల్టీల కమిషనర్ లతో టీడీఆర్ బాండ్ల జారీపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.. తణుకులో టీడీఆర్ కుంభకోణంపై విచారణ పూర్తయిన తర్వాత సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న వాటిలో 321 టీడీఆర్ ల వెరిఫికేషన్ పూర్తయిందని.. మరో 501 టీడీఆర్ ల వెరిఫికేషన్ జరగాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ..