గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని ఆరోపించారు. అలాగే, గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత పనులు జరుగుతాయి అన్నారు. దీంతో పాటు మరో 16 సంస్థలకు చెందిన భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ఆరోపించారు.
Minister Narayana: ఎన్టీవీతో మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ఈ నెల 12 నుంచి 15వ తేదీ మధ్య రాజధాని నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. త్వరలోనే ముహూర్తం ఖరారు అవుతుంది.. మొదటి దశలో 40 వేలు కోట్ల రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఇక, ప్రజల డబ్బులతో రాజధాని కడతారని ఎవరు చెప్పారు?.
Minister Narayana: నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు.
Minister Narayana: గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు.
Minister Narayana: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాకు సంబంధించిన ఏర్పాట్ల అధ్యయనానికి మంత్రి నారాయణ బృందం వెళ్లింది.
ఏపీ మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ముంబైలో పర్యటిస్తున్నారు.. మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ఇతర అధికారులు.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA), సిడ్కో అధికారులతో సమావేశమయ్యారు.. ఈ సమావేశంలో MMRDA ప్లానింగ్ డైరెక్టర్ శంకర్ దేశ్ పాండే, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు..
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సిటీ…
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసకర పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టగా వైసీపీ నేత బాలకృష్ణా రెడ్డి ఇంటిని కూలగొట్టడమే అని మండిపడ్డారు. సంపద సృష్టించడం అంటే.. ఉన్న ఆస్తులను పగలగొట్టడమా? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే స్కూళ్లు, కాలేజీలను నిర్వహించడం కాదని మంత్రి నారాయణ తెలుసుకోవాలని కాకాని పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్లో నగరపాలక సంస్థ అధికారులు కూల్చిన…
వచ్చే నెలాఖరులోగా రాజధాని నిర్మాణాలు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ నెలాఖరుకు రాజధాని టెండర్ల ప్రక్రియ పూర్తవుంటుందని, ఇప్పటివరకు 40 పనులకు టెండర్లు పిలిచాం అని చెప్పారు. మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం అని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. నేడు రాజధాని ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. నేలపాడులో ఐకానిక్ బిల్డింగ్ పునాదులను పరిశీలించారు. పునాదుల్లోకి నీరు చేరడంతో మిషన్ సహాయంతో నీటిని బయటకు పంపుతున్న కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు. ‘ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్…
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్‌మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.