రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని.. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం పెరుగుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం అని.. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటు రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో ఏపీని చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది తమ లక్ష్యం అని మంత్రి నారాయణ చెప్పారు. నెల్లూరు సిటీ పరిధిలోని కిసాన్ నగర్, ఏసీ నగర్లలోని పార్కుల ఆధునికీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు పెడుతున్నాం. నెల్లూరు, కాకినాడ, రాజమహేంద్రవరంలతో పాటూ రాయలసీమలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజల ఆరోగ్యం ఎంత అవసరం. ప్రజల ఆరోగ్యం బాగుంటే వ్యక్తిగత ఆదాయం, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. అందుకే ప్రజల ఆరోగ్యంకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాం. వివిధ దేశాల్లో అధ్యయనం చేసిన తర్వాత చెత్తను సద్వినియోగం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నాం. వచ్చే రెండేళ్లలో చెత్త రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దాలనేది మా లక్ష్యం’ అని చెప్పారు.