తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి.. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు.. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిచింది.. అయితే, ఎమ్మెల్యే సమావేశంపై స్పందించిన…
నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అని అన్నారు మంత్రి మల్లా రెడ్డి. కల కన్నా.. నిజం చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అన్నారు. మెడికల్ కాలేజీ కట్టి .. ఆరేళ్ళు నష్టపోయిన ఇబ్బంది పడ్డా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి, వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదని అన్నారు.
రాష్ట్ర కార్మికశా మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ప్రభుత్వ భూముల కబ్జాలతో అక్రమ సంపాదనతో కోట్ల రూపాయలను దోచుకున్నారని పీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది.. అయితే, మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల…
ఇవాళ ఐటీ విచారణకు మల్లారెడ్డి కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. మల్లారెడ్డితో పాటు 16 మంది నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే నేడు ఐటీ ముందు హాజరుకానున్న 14 మంది హాజరు కానున్నారు. మరి 16 మందిలో ఇద్దరు హాజరవుతారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తు తున్నాయి. ఇవాల ఐటీ ముందుకు మంత్రి రెడ్డితో పాటు మరొకరు కూడా హాజరుపై ఉత్కంఠ నెలకొంది.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు మరో 26 రోజుల వ్యవధి మాత్రమే వుంది. ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు ఎన్నికల కార్యాచరణలో వేగాన్ని పెంచాయి. 12మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలకు అధికార టీఆర్‌ఎస్ బాధ్యతలు అప్పగించగా నిన్న శనివారం ఒక్కరోజే ఐదుగురు మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
టీఆర్ఎస్ కాస్తా ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారబోతోంది.. కొత్త పార్టీకి విజయ దశమిని ముహూర్తంగా ఎంచుకున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. అయితే, విజయ దశమి సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీఆర్‌ఎస్ అవిర్భావానికి లింక్ పెడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి… ఆనాడు కౌరవులపై పాండవులు విజయం సాధించారు.. ఇవాళ కూడా కౌరవుల లాంటి బీజేపీ నాయకులపై తమ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధిస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో…