Revanth Reddy fire on Minister Mallareddy: రాష్ట్ర కార్మికశా మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ప్రభుత్వ భూముల కబ్జాలతో అక్రమ సంపాదనతో కోట్ల రూపాయలను దోచుకున్నారని పీసీసీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, మేడ్చల్ నియోజకవర్గం నుంచే వారి పతనాన్ని ప్రారంభించానాని అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన రేవంత్ రెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు జవహర్ నగర్ కు చెందిన సుమారు 300 మంది కాంగ్రెస్లో చేరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నాయకులు కోట్ల రూపాయలను దోచుకుంటూ మాయమాటలతో ప్రజలను మోసగించడమే తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.
Read also: IND Vs BAN: నేడు తొలి వన్డే.. టీమిండియా జట్టు కూర్పు ఎలా ఉంటుంది?
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ జవహర్ నగర్ కు వచ్చి ఇక్కడి సమస్యలు పరిష్కరిస్తానంటూ మాయమాటలు చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క సమస్యను పరిష్కరించలేదన్నారు. జవహర్ నగర్ లో వృథాగా మిగిలిన రాజీవ్ స్వగృహ భవన సముదాలను గాలికొదిలేశారని, జీవో 58, 59లతో ఇప్పటి వరకు ఒక్క పేదోడి ఇంటిని క్రమబద్ధీకరించలేదన్నారు. జవహర్ నగర్ లోని ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి సొంత ఆసుపత్రిని నిర్మించుకుని వ్యాపారం చేస్తున్నాడు కానీ పేదలకు ఎలాంటి ఉచిత వైద్యం అందించడం లేదని పదుల సంఖ్యలో కళాశాలలు నడిపిస్తున్న మల్లారెడ్డి గతంలో ఎంపీగా, ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి చేసిందేమి లేదన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో పరిసర ప్రాంత చెరువులు, భూగర్భజలాలు కలుషితమైనా శాశ్వత పరిష్కారాన్ని చూపలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీదర్, జిల్లా నాయకులు తోటకూర వజ్రేష్ యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోగుల సరిత. జవహర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Delhi Municipal Election: నేడు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీ, ఆప్ మధ్యే తీవ్ర పోటీ..