టీఆర్ఎస్ కాస్తా ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మారబోతోంది.. కొత్త పార్టీకి విజయ దశమిని ముహూర్తంగా ఎంచుకున్నారు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్.. అయితే, విజయ దశమి సందర్భాన్ని గుర్తు చేస్తూ.. బీఆర్‌ఎస్ అవిర్భావానికి లింక్ పెడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి… ఆనాడు కౌరవులపై పాండవులు విజయం సాధించారు.. ఇవాళ కూడా కౌరవుల లాంటి బీజేపీ నాయకులపై తమ పార్టీ అధినేత కేసీఆర్ విజయం సాధిస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ విజయం సాధించబోతున్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతే కాదు.. సీఎం కేసీఆర్.. భారత ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు మంత్రి మల్లారెడ్డి.. మరోవైపు.. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించిన విషయం తెలిసిందే.. గుజరాత్ లోనూ పోటీ చేస్తాం.. ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేసిన చోట కూడా మా పార్టీ పోటీ చేయబోతుందని ఆయన వెల్లడించారు. మొత్తంగా.. పార్టీ ప్రకటనకు ముందే.. ఆ పార్టీపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా మంత్రులు వరుసగా ప్రకటనలు చేస్తున్నారు.
Read Also: Minister Srinivas Goud: గుజరాత్‌లోనూ పోటీ చేస్తాం..