IT Raids on Malla Reddy Case: తొలిరోజు ముగిసిన విచారణ.. మరో 10 మందికి నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో తొలిరోజు విచారణ ముగిసింది.. అయితే, మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల సమన్లు పంపారు.. ఇవాళ్టి విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా 10 మందికి సమన్లు జారీ చేశారు.. డిసెంబర్ 5వ తేదీ వరకూ పలువురిని వరుసగా విచారించనున్నారు.. విచారణలో ప్రధానం మెడికల్ సీట్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు ఐటీ అధికారులు.. రేపు మంత్రి మల్లారెడ్డి తరుఫున ఆడిటర్ విచారణకు హాజరుకాబోతున్నారు.
Read Also: CM KCR: యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కేసీఆర్.. ఇది దేశ కీర్తి పెంచుతుంది..
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ఇక, తొలిరోజు విచారణ ముగియడంతో.. ఐటీ కార్యాలయం నుండి వెళ్లిపోయారు మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి.. అయితే, మహేందర్ రెడ్డిని ఇవాళ రమ్మని చెప్పి నోటీసు ఇవ్వలేదు, అందుకే మహేందర్ రెడ్డి విచారణకు రాలేదని.. డిసెంబర్ 5వ తేదీ వరకు విచారణకు రావాలని మా ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించిన చాలా మందికి నోటీసులు పంపించారు.. క్లర్క్ స్థాయి నుండి మొదలు పెడితే అకౌంటెంట్ డైరెక్టర్ల వరకు ఈ నోటీసులు ఉన్నాయని.. విచారణలో ఒక ఫార్మాట్‌లో తమని డీటెయిల్స్ ఇవ్వమన్నారు వాటిని ఆ ఫార్మట్‌లో ఇచ్చామని.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామన్నారని తెలిపారు.. తాము ఐటీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నామని మీడియాకు వివరించారు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి.
అయితే, తొలిరోజు ఐదు గంటల పాటు విచారణ సాగింది.. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు ఐటీ అధికారులు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు, ఫీజు వసూలుపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు.. ఐటీ అధికారులు ఇచ్చిన ఫార్మట్‌లోనే వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అదే ఫాలో అయ్యారు.. ఇక, తొలిరోజు విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేం సమాధానాలు చెప్పాం.. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారని.. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారన్నారు.. మేం చెప్పిన సమాధానాలతో ఐటీ అధికారులు సంతృప్తి చెందిఉంటారని తాను భావిస్తున్నానని వెల్లడించారు.
ఇక, మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారు.. ఐటి అధికారుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తామన్నారు.. మరోవైపు.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి మల్లారెడ్డి కుమారుడు చామకూర భద్రారెడ్డి.. మాతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని విచారణ చేశారు.. మా స్టేట్‌మెంట్‌తో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు.. మేం చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు భద్రారెడ్డి. మొత్తంగా తొలిరోజు విచారణ ముగిసింది.. ఈ కేసులో నోటీసులు, విచారణ ఉత్కంఠరేపుతోంది.
తాజావార్తలు
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?