Malla Reddy: నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను.. అంతా ఆన్లైన్ అడ్మిషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malla Reddy: నా కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేను, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అని అన్నారు మంత్రి మల్లా రెడ్డి. కల కన్నా.. నిజం చేసుకున్న.. నా అంత అదృష్టవంతుడు ఎవరు లేరని అన్నారు. మెడికల్ కాలేజీ కట్టి .. ఆరేళ్ళు నష్టపోయిన ఇబ్బంది పడ్డా అని ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళకి, వేరే పార్టీ అని అనుమతి ఇవ్వలేదని అన్నారు. రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నానని అన్నారు. బ్లాక్ మెయిలర్స్ ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎంబీబీఎస్ బ్యాచ్ లు రాకుండా రాజకీయ బ్లాక్ మెయి లైర్స్ చేశారని అన్నారు. తుఫాన్ లు వచ్చినా తట్టుకుంటా అనే దైర్యం వచ్చిందని తెలిపారు. పాల వెండర్ గా ఈ స్థాయికి వచ్చినా అని పేర్కొన్నారు. ఫారిన్ ఫండ్స్ రాలేదని, కష్టపడ్డా సాధించా అన్నారు మంత్రి. కేసీఆర్ నాకు యునివర్సిటీ ఇచ్చారని, డబ్బులు ఉంటే బిల్డింగ్స్ కట్టొచ్చు కానీ మంచి ప్రొఫెసర్స్ రారని మల్లరెడ్డి అన్నారు.
Read also: Buggana Rajendranath: సీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా? లేదా?
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
గాంధీ, ఉస్మానియా తరవాత మా కాలేజీనే అంటూ పేర్కొన్నారు. ఫస్ట్ ఇయర్ కష్టపడితే ఎంబీబీఎస్ పాస్ ఐనట్టే అని తెలిపారు. మెడికల్ కాలేజీలో డొనేషన్స్ లేవని, అంతా ఆన్లైన్ అడ్మిషన్స్ అన్నారు. తన కొడుకుకి సీటు కావాలన్నా నేను ఇవ్వలేనని అన్నారు. బర్త్ డే లు పిక్నిక్స్ ఉండొద్దనిచ పిల్లలను పాడు చేసేది పేరెంట్స్ అని అన్నారు. కొన్ని సాధించాలి అంటే కొన్నింటికి దూరం ఉండాలని తెలిపారు. ప్రేమ.. ఫ్రెండ్ షిప్ అన్నిటికీ దూరం ఉండాలని పేర్కొన్నారు. నేను ఏది దాచుకోను, భూమి అమ్మి కొడుకును ఎంబీబీఎస్ చేపించా అన్నారు మల్లారెడ్డి. ఎంపీ, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అయ్యానని అన్నారు. నాకు ఎలాంటి కోరికలు లేవని స్పష్టం చేశారు. ఒక డాక్టర్ ను చదివిస్తే కోడలుగా మరో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందని అన్నారు. రెడ్డి అమ్మాయిని చేసుకుంటే కిట్టి పార్టీలు, పిక్నిక్ లు వెళ్ళేదని సంచళన వ్యాఖ్యలు చేశారు.
Read also: Andhra Pradesh: ఏపీకి మరోసారి తుఫాన్ ముప్పు.. నాలుగు జిల్లాలకు హెచ్చరికలు
నా కోడలుకు అమ్మ నాన్న లేరు, నాకు కోడలు మూడో కొడుకు లాగా అని మంత్రి మల్లా రెడ్డి వ్యాఖ్యానించారు. ఐటీ రైడ్ చేశారు,నేను భయపడలేదన్నారు. 400 మంది వచ్చారు, వాళ్ల పని వాళ్ళు చేసుకుని వెళ్లారని తెలిపారు. మేము బయపడము, నేను క్యాసినో నడిపించట్లేదు, కాలేజీ నడిపిస్తున్నానని అన్నారు. 33 కాలేజీలు నడిపిస్తున్న..నాది సింపుల్ లైఫ్.. హై థింకింగ్ అన్నారు మల్లారెడ్డి. 300 గజాల స్థలంలో నా ఇల్లు ఉందన్నారు. వందల మంది డాక్టర్స్.. ఇంజనీర్లు తయారు చేస్తున్నాఅని అన్నారు. అందుకే చిన్న ఇంట్లో ఉంటున్న అని తెలిపారు. మల్లా రెడ్డి మెడికల్ కాలేజీ డైరెక్టర్ ప్రీతి రెడ్డి మాట్లాడుతూ.. మా కాలేజీ పై చాలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అడ్మిషన్స్ పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. ఆరోపణలపై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. విద్యార్థులే మా కాలేజీని ప్రియారిటీగా ఎంచుకుంటున్నారని తెలిపారు. అన్ని అడ్మిషన్స్ ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. మా బంధువులకు కూడా మేము మెడికల్ కాలేజీ అడ్మిషన్స్ ఇవ్వలేమన్నారు. పైకి వెల్లేకొద్ది ఇలాగా హై లైట్ కావడం సహజమన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!