తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు మెనియా నడుస్తోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవితో పాటు కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. అక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే.. ఇప్పటికే 2024 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఉవ్విళ్లురుతున్న కాంగ్రెస్, బీజేపీలతో పాటు అధికార టీఆర్‌ఎస్ కి సైతం ఈ ఉప ఎన్నిక మరో అవకాశాన్ని తెచ్చిపెట్టినట్లైంది. అయితే.. ఈ నేపథ్యంలో నేడు టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే.. ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అయితే.. టీఆర్‌ఎస్ పార్టీలో మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇవాళ మునుగోడుకు వస్తున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన డ్యాన్స్ ఈరోజు హైలైట్ ఆఫ్ ది డేగా నిలిచింది. తన కాన్వాయ్‌లో వస్తున్న మల్లారెడ్డి ఓపెన్ టాప్ కారులో నిల్చుని ఊరా మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక, కారు దిగిన అనంతరం కూడా మల్లారెడ్డి మాస్ డ్యాన్స్ స్టెప్పులతో ఇరగదీశారు. ఆయన డ్యాన్స్ చేయడంతో అక్కడున్న టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో జోష్ పెరిగి మంత్రితో వారు కూడా డాన్స్ చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.