తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్రలు చేయవచ్చన్నారు. అయితే దేని కోసం ఎక్కడ చేస్తున్నామన్నది ముఖ్యమని.. షర్మిలది అత్మ మీద కోపం దుత్తమీద అన్నట్లు.. అన్న మీద కోపం ఉంటే.. అక్కడ చూసుకోవాలి గానీ.. ఇక్కడేంటని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ బ్రతికున్నంత వరకూ తెలంగాణ వ్యతిరేకని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిలా కాంట్రిబ్యూషన్ ఏముందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఆర్‌ఎస్…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో జరిగిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు 11 రాష్ట్రాలు కాపీ కొట్టాయని, మిషన్ భగీరథను అమలు చేస్తున్నాయన్నారు. రైతు బంధును పీఎం కిసాన్ అని, హర్ ఘర్ జల్ కూడా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలకు నేడు తెలంగాణ దిక్సూచిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 8 ఏళ్లలో బీజేపీ ప్రజలకు చేసిందేమి లేదని,…
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ జాతీయ పార్టీ కాదని, దక్షిణాదిలో బీజేపీ లేదని ఆయన అన్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ ఉందా అని ఆయన అన్నారు. తెలంగాణలో ఏదో పొరపాటున 4 ఎంపీ సీట్లు గెలిచారన్నారు. కర్ణాటకలో కూడా బీజేపీ చిల్లర రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అని,…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుతో ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అపర చాణిక్యుడైన కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ సాయం ఎందుకు కావాల్సి వచ్చిందనే ఎన్టీవీ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఇస్తూ.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు 10 సంవత్సరాలు ఉన్న బాలుడు, రాబోయే సంవత్సరం, రెండు సంవత్సరాల్లో ఓటరు కాబోతున్నాడు. ఆ బాలుడికి కేసీఆర్ ఉద్యమ నాయకుడి కాకుండా ముఖ్యమంత్రిగానే తెలుసు అని, జనరేషన్ మారుతున్న కొద్దీ,…
టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై వివరించారు. తాను 8 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. తర్వాత 8 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని.. అందుకే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కలిగిన తృప్తి, సంతోషంతో పోలిస్తే మిగతా విషయాలు సరితూగవన్నారు.…
తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంపై అయినా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన మాటల్లో చాలా క్లారిటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి పీకే అవసరం ఉందా?, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతపై ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ వ్యూహమేంటి? ఇలా పలు రకాల ప్రశ్నలకు…
తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యాదాద్రిలో పర్యటించిన క్రమంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పెట్టిన భిక్ష కేసీఆర్ కుటుంబానికి పదవులు. తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్, కేటీఆర్ మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ భిక్ష అంటూ ఆయన అగ్రహం వ్యక్తం…
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే…
నిన్న వరంగల్‌లో రాహుల్ గాంధీ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో సభస్థలాన్ని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. రేవంత్ రెడ్డికి నోటి తీట ఎక్కువ అయ్యిందని, తీట తీరుస్తాం అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత బ్లాక్…
తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో వరంగల్ పర్యటన, రైతు సంఘర్షణ సభ నేపథ్యంలో నిన్న వరంగల్‌లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు సభ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా శవయాత్ర…